Begin typing your search above and press return to search.
బాబూ నాగశౌర్యా.. ఏంటా దూకుడు?
By: Tupaki Desk | 8 Dec 2015 1:30 PM GMTదర్శకుడు రమేష్ వర్మ చివరి సినిమా ‘వీర’ పెద్ద డిజాస్టర్. ఇక నాగశౌర్య హీరోగా నటించిన చివరి సినిమా ‘జాదూగాడు’ కూడా పెద్ద ఫ్లాపే. వీళ్లిద్దరి కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా ‘అబ్బాయితో అమ్మాయి’. హీరోయిన్ కొత్తమ్మాయి. నిర్మాతలూ కొత్తవాళ్లే. పోస్టర్లవీ అందంగా, క్రియేటివ్ గా బాగానే ఉన్నాయి కానీ.. సినిమాకు మరీ అంత క్రేజ్ ఏమీ లేదు. అయినప్పటికీ క్రిస్మస్ సీజన్ లో మరో మూడు సినిమాలతో పోటీ పడటానికి రెడీ అయిపోతోందీ చిన్న సినిమా. నిజానికి డిసెంబర్ అన్నదే అన్ సీజన్. ఐతే నెలాఖర్లో క్రిస్మస్ సెలవులుంటాయి కాబట్టి.. ఆ అడ్వాంటేజీ వాడుకోవడానికి ఒకట్రెండు సినిమాలు పోటీకి దిగడం కామన్.
కానీ ఈసారి విచిత్రంగా క్రిస్మస్ పండక్కి ఏకంగా నాలుగు సినిమాలు వచ్చేస్తున్నాయి. వీటిలో ముందుగా మామ మంచు అల్లుడు కంచు - సౌఖ్యం సినిమాలు డేట్ ఫిక్స్ చేసుకున్నాయి. ఈ రెండు సినిమాలకు క్రేజ్ బాగానే ఉంది. ఇక లేటుగా రేసులోకి వచ్చిన సుధీర్ బాబు సినిమా ‘భలే మంచి రోజు’ కూడా ఆసక్తికర టీజర్ - ట్రైలర్ తో జనాల్ని ఆకట్టుకుంది. ఈ మూడు సినిమాలూ ఒకే రోజు, డిసెంబరు 25న విడుదల కాబోతున్నాయి. ఐతే మూడు సినిమాలు పోటీ పడటమే ఎక్కువనుకుంటే ఇప్పుడు ‘అబ్బాయితో అమ్మాయి’ కూడా తయారైంది. ఇలా ఒకేసారి పోటీపడటం ఏ సినిమాకూ మంచిది కాదు. ఇలా పోటీ పడటం వల్ల అన్యాయమైపోయిన చిన్న సినిమాలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ నాగశౌర్య - రమేష్ వర్మ డిసెంబరు 24న సినిమా రిలీజ్ అంటున్నారు. దీని వల్ల ఎలాంటి ఫలితం చూస్తారో?