Begin typing your search above and press return to search.

లిప్‌ కిస్సులేమీ పెట్టలేదండీ బాబూ

By:  Tupaki Desk   |   3 March 2016 9:30 AM GMT
లిప్‌ కిస్సులేమీ పెట్టలేదండీ బాబూ
X
మరోసారి తన లిప్‌ కిస్సులపై ఫుల్‌ క్లారిటీ ఇచ్చేశాడు యంగ్‌ హీరో నాగ శౌర్య. ఒక ప్రక్కన ఎంత కష్టపడి సినిమాలు చేస్తున్నా కూడా.. మనోడికి తన డెబ్యూ సినిమా తరువాత ఒక్క కమర్షియల్‌ హిట్‌ కూడా రాలేదు. ఊహలు గుసగుసలాడే సినిమా తరువాత దిక్కులు చూడకు రామయ్య యావరేజ్‌ అయితే.. తరువాత వచ్చిన జాదూగాడు, అబ్బాయితో అమ్మాయి వంటి సినిమాలు డిజాష్టర్లు.

మరో విషయం ఏంటంటే.. జాదూగాడు సినిమాలో సోనారిక బడోరియాతో.. అలాగే అబ్బాయితో అమ్మాయి సినిమాలో పలక్‌ లల్వానితో ఘాటైన పెదాల ముద్దులు లాగించేశాడు నాగ శౌర్య. ఇక ఆ రెండు సినిమాలూ ఫ్లాప్‌ కావడంతో.. మరోసారి లిప్‌ కిస్‌ అనేది తన సినిమాల్లో వాడకూడదని ఫిక్సయ్యాడట. ఇప్పుడు నందిని రెడ్డి తీసిన ''కళ్యాణ్‌ వైభోగమే'' సినిమాలో అందుకే నటి మాళవిక నాయర్‌ తో అలాంటి సీన్లేవీ లేవు అంటూ ప్రతీ ఇంటర్యూలోనూ కాస్త గట్టిగానే చెబుతున్నాడు. ఈ శుక్రవారం విడుదలవనున్న ఈ సినిమాలో కిస్సులు ఉండవని.. అలాగే గ్లామరసం ఏమీ ఉండదని.. మనోడు స్పెషల్‌ గా చెప్పాలా ఏంటి.. హీరోయిన్‌ మాళవిక ఉందంటేనే అర్దంచేసుకోవచ్చు.

సర్లేండి.. ఈ సినిమాతో ఇటు నందిని రెడ్డి.. అటు నాగ శౌర్య.. ఇద్దరూ ఫామ్‌ లోకి వస్తారా? రావాలనే ఆశిద్దాం.