Begin typing your search above and press return to search.
మెగా రూమర్స్ గురించి శౌర్య రెస్పాన్స్
By: Tupaki Desk | 3 Jun 2019 8:20 AM GMTఆ మధ్య యూత్ హీరో నాగ శౌర్యకు మెగా డాటర్ నీహారికకు పెళ్లి జరగబోతోందన్న పుకార్లు కొంతకాలం గట్టిగానే షికారు చేశాయి. అదేమీ లేదని ఇద్దరూ స్వయంగా క్లారిటీ ఇచ్చాక సద్దుమణిగాయి. నీహారిక డెబ్యూ మూవీ ఒక మనసు హీరో నాగశౌర్య కావడం ఇద్దరి మధ్య మంచి ఫ్రెండ్ షిప్ ఉండటం లాంటి కారణాలు గాసిప్స్ కి ఊతమిచ్చాయి. అదంతా గతం. అయితే తాజాగా మరోసారి దీని గురించి నాగశౌర్య స్పందించాల్సి వచ్చింది. దానికి కారణం లేకపోలేదు.
ఇటీవలే నీహారిక తన సోషల్ మీడియా అకౌంట్ ఒకదాంట్లో ఓ కిడ్ తో ఉన్న ఫోటో పెట్టి ఇద్దరిలో ఎవరు క్యూట్ గా ఉన్నారని ప్రశ్న వేసింది. నెటిజెన్ల నుంచి సమాధానాలు రావడం సహజమే కానీ నాగ శౌర్య తనకున్న స్నేహం దృష్ట్యా ఇద్దరు ఆకట్టుకున్నారని పాడు కళ్ళు పడకుండా దిష్టి తీయించుకోమని కామెంట్ పెట్టాడు. ఇందులో ఎలాంటి ఇతర ఉద్దేశాలు లేవు. కానీ అత్యుత్సాహం చూపించే కొన్ని వర్గాలు ఇదుగో నాగ శౌర్య ఇంత పాజిటివ్ గా అదే పనిగా కామెంట్ పెట్టాడు కాబట్టి త్వరలో మ్యారేజ్ అంటూ మళ్ళి ప్రచారం మొదలుపెట్టేశాయి.
దీంతో మరోసారి స్పందించక తప్పలేదు నాగశౌర్యకు. నీహారిక తనకు ఎప్పటికీ బెస్ట్ ఫ్రెండ్ అని కేవలం ఊహాగానాలను ఆధారంగా చేసుకుని ఇలా స్ప్రెడ్ చేయడం భావ్యంగా లేదని చెప్పాడు. దీని వల్ల తన స్నేహితులు కొందరు నీహారికతో వెడ్డింగ్ అని పొరబడ్డారని అందుకే మరోసారి క్లారిటీ ఇస్తున్నానని కుండబద్దలు కొట్టేశాడు. దీనికి ఇప్పటికైనా చెక్ పడాలని అటు మెగా ఫాన్స్ తో పాటు నాగశౌర్య అభిమానులు కోరుతున్నారు