Begin typing your search above and press return to search.

రూమ‌ర్స్ ప‌ట్టించుకోను-నాగ శౌర్య‌

By:  Tupaki Desk   |   16 Jun 2016 1:34 PM GMT
రూమ‌ర్స్ ప‌ట్టించుకోను-నాగ శౌర్య‌
X
సెల‌బ్రిటీల మీద గాసిప్స్ రావ‌డం స‌ర్వ‌సాధార‌ణం. ముఖ్యంగా యువ హీరో... హీరోయిన్ల మీద రూమ‌ర్స్ రావ‌డం కామ‌న్ అయిపోయింది. వాటిలో కొన్ని నిజం వుంటున్నాయి. కొన్ని ఫేక్ వుంటున్నాయి. తాజాగా త‌న‌ మీద వ‌చ్చిన రూమ‌ర్స్ లో కూడా నిజం లేదంటున్నాడు యువ హీరో నాగ‌శౌర్య‌. ఒక మ‌న‌సు సినిమాలో నాగబాబు కూత‌రు నిహారిక‌తో క‌లిసి న‌టించిన ఈ యంగ్ హీరో... ఆమెతో డేటింగ్ చేస్తున్నాడ‌నే ప్ర‌చారం కొంత కాలంగా సోష‌ల్ మీడియాలో ర‌న్ అవుతోంది. ఇదే విష‌యాన్ని ఈ సినిమా ప్ర‌మోష‌న్లో భాగంగా మీడియా ముందుకొచ్చిన నాగ‌శౌర్య‌ను ప్ర‌శ్నిస్తే... నేను కూడా విన్నాను. ఇలాంటి రూమ‌ర్స్ ఇంత‌కు ముందు కూడా వ‌చ్చాయి. రాశి ఖ‌న్నా.. సోనారికా.. రెజీనాల‌తో కూడా నాకు లింకు పెట్టి రాశారు. రెజీనాతో సినిమా చేయ‌క‌పోయినా.. ఆమెతో నాకు లింకు పెట్ట‌డం ఫ‌న్నీ అనిపించింది. నాకు అనుష్క అంటే చాలా ఇష్టం. ఆమెతో కూడా నాకు లింకుంద‌ని రాస్తారేమో చూడాలి. ఇప్పుడు నిహారిక‌తో డేటింగ్ అంటున్నారు. ఇక భ‌విష్య‌త్తులో న‌టించే హీరోయిన్ల మీద కూడా ఇలాంటివి పుట్టిస్తారేమో. ఇంట్లో వాళ్లు ఇలాంటి రూమ‌ర్స్ విని మొద‌ట ప్ర‌శ్నించేవారు. కానీ అవి నిజం కాద‌ని తెలిసి.. వారు కూడా వాటికి అల‌వాటు ప‌డిపోయి అడ‌గ‌టం మానేశారని తెలిపాడు.

ఇక సినిమా విష‌యాల గురించి మాట్లాడుతూ... ఇందులో నేను పొలిటిక‌ల్ బ్యాక్ డ్రాప్ వున్న ఫ్యామిలీ అబ్బాయిగా న‌టిస్తున్నా. ఓ అప్ క‌మింగ్ పొలిటీషియ‌న్ ఎలాంటి స్ట్ర‌గుల్ ఎదుర్కొంటారో.. అలాంటి స్ట్ర‌గుల్సే ఇందులో ఎదుర్కొన్నా. మొద‌ట దీన్ని టీవీ9 ఒక్క‌టే నిర్మిస్తోంద‌ని చెప్ప‌గా వెంట‌నే ఒప్పేసుకున్నా. ఆ త‌రువాత మ‌ధుర శ్రీధ‌ర్ క‌లిశాడు. దాంతో మ‌రింత హ్యీపీగా ఫీల‌య్యా. ప్ర‌స్తుతం జో అచ్యుతానంద చేస్తున్నా. అది మ‌రో రెణ్నెల్ల‌లో కంప్లీట్ అవుతుందని ముగించారు.