Begin typing your search above and press return to search.
యంగ్ హీరో రిస్క్ చేశాడా?
By: Tupaki Desk | 16 Sep 2017 1:44 PM GMTఒక సినిమా హిట్ కాలవాలంటే భారీ బడ్జెట్ భారీ తారాగణం ఉంటే సరిపోదు. ఆ సినిమాలో మంచి కంటెంట్ ఉంటేనే ప్రేక్షకులు ఆదరిస్తారు. ప్రస్తుత రోజుల్లో కథలు దొరకడం కాస్త కష్టంగానే ఉన్నా దొరికిన కొన్ని పాయింట్స్ లో దర్శకులు భారీ తారాగణంతో కమర్షియల్ ఫార్ములాలో ముందుకు తీసుకువెళుతున్నారు. అవసరం లేకున్నా ఫైట్స్ - సాంగ్స్ పెట్టి కాస్త ప్రేక్షకుడిని ఎంటర్టైన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుత రోజుల్లో కొందరు యువ హీరోలు అయితే ఏకంగా వారి స్థాయిలో ఉన్న మరొక కుర్ర హీరోలను అతిధి పాత్రలు చేయిస్తూన్నారు.
దీంతో స్పెషల్ రోల్ లో ఎంట్రీ ఇచ్చిన కొంతమంది హీరోలకి ఆ పాత్రలను లాభాలను ఇస్తుంటే మరికొంతమందికి అపజయాలను అందిస్తున్నారు. రీసెంట్ గా యంగ్ హీరో నాగ శౌర్య కూడా ఇదే తరహాలో చేసి లైఫ్ ని రిస్క్ లో పెట్టాడా? అనే కామెంట్స్ వినబడుతున్నాయి. ఎందుకంటే ఈ కుర్ర హీరోకి నారా రోహిత్ ఫ్రెండ్ అవ్వడంతో అతను తీసిన "కథలో రాజకుమారి" అనే సినిమాలో స్పెషల్ రోల్ చేశాడు. కథాపరంగా అవసరమయ్యే పాత్ర అయినా తెరపై అలరించకపోవడంతో సినిమా ఊహించని విధంగా నెగిటివ్ టాక్ ను అందుకుంటోంది. నాగ శౌర్య పాత్ర ఆ సినిమాకు ఏ విధంగా ఉపయోగపడలేదు.
మొదట్లో నాగ శౌర్య తనదైన శైలిలో లవ్ స్టోరీలే చేసి ఓ వర్గం ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. నటనపరంగా బాగానే ఆకట్టుకున్న ఇంకా స్టార్ హీరో లెవెల్ లో మార్కెట్ ను సెట్ చేసుకోలేక కొంత ఇబ్బందిపడుతున్నాడు. అలాగే గత చిత్రాలు కూడా నాగ శౌర్యకి కొంత నిరాశనే మిగిల్చాయి. అతను తలచుకుంటే మంచి లవ్ స్టోరీస్ ని తీసి హిట్ కొట్టవచ్చు అనే కామెంట్స్ కూడా వినబడుతున్నాయి. అయితే ఫిదా బ్యూటీ సాయి పల్లవి తో ఓ సినిమా చేస్తున్న ఈ హీరో హిట్ అందుకుంటాడో లేదో చూడాలి.