Begin typing your search above and press return to search.
మాస్ ఇమేజ్ కోసం లవర్ బాయ్ ప్రయత్నాలు!
By: Tupaki Desk | 26 Sep 2019 11:30 AM GMTఒక హీరో ఇమేజిని బట్టే కలెక్షన్స్ ఉంటాయి. అందులో ఎలాంటి అనుమానం లేదు. ఒక హీరోకు ఫుల్లుగా మాస్ ఇమేజ్ ఉంటే ఇక ఓపెనింగ్స్ కు ఢోకా ఉండదు. సినిమాకు వచ్చే టాక్ తో సంబంధం లేకుండా మినిమమ్ కలెక్షన్స్ నమోదవుతాయి. అందుకే యువహీరోలు చాలామంది మాస్ ఇమేజ్ కోసం పాకులాడతారు. కొందరికి ఆ ప్రయత్నాలు వికటించి చతికిలపడతారు. కొందరికి మాత్రం అవి వర్క్ అవుట్ అవుతాయి.
ప్రస్తుతం యంగ్ హీరో నాగశౌర్య యాక్షన్ పై ఫుల్లుగా ఫోకస్ చేస్తున్నాడు. ఇది మాస్ హీరో గా మారే ప్రయత్నాల్లో భాగమేనని మనం అనుకోవచ్చు. నాగశౌర్యకు ఈమధ్య నాలుగు ప్రాజెక్టులను లైన్లో పెట్టిన సంగతి తెలిసిందే. వాటిలో తన హోమ్ బ్యానర్ ఐరా క్రియేషన్స్ పై తెరకెక్కే చిత్రం కూడా ఉంది. ఈ సినిమాకు రమణతేజ దర్శకుడు. 'కేజీఫ్' చిత్రానికి స్టంట్స్ డిజైన్ చేసిన వారే ఈ సినిమాకు స్టంట్ మాస్టర్ కావడం గమనార్హం. వారి పర్యవేక్షణలో నాగశౌర్య సూపర్ స్టంట్స్ చేస్తున్నాడు. మీరు పైన చూసినవి దీనికి సంబంధించిన ఆన్ లొకేషన్ స్టిల్స్. ఈ ఫోటోల్లో శౌర్య హ్యాండ్సమ్ గా.. డ్యాషింగ్ లుక్ లో కనిపిస్తున్నాడు.
గతంలో సాధారణంగా కనిపించిన శౌర్య ఈ సినిమా కోసం మాత్రం ఈ జెనరేషన్ లోని ఇతర హీరోల తరహాలో కండలు పెంచి మజిల్ మ్యాన్ గా మారిపోయాడు. ఇప్పుడేమో భారీ స్టంట్స్ చేస్తున్నాడు. మరి ఈ కొత్త రూట్ శౌర్య కెరీర్ కి హెల్ప్ అవుతుందో లేదో వేచి చూడాలి.