Begin typing your search above and press return to search.
బాలయ్య టైటిల్.. ఇక ఆ యంగ్ హీరోదే!
By: Tupaki Desk | 3 Nov 2017 7:18 AM GMTయంగ్ హీరో అంటారు కానీ నాగశౌర్యది దాదాపు ఆరేళ్ల ఇండస్ట్రీ. సినిమాల్లో నటించటం కోసం అతడుపడిన కష్టాలు అన్నిఇన్ని కావు. బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి పేరు తెచ్చుకొని నిలవటం అంత చిన్న విషయం కాదు. ఆ లెక్కలో చూస్తే నాగశౌర్య చాలానే సాధించినట్లు చెప్పాలి.
అయితే.. తన మాదిరే ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన వారిలో ఇప్పటికి స్ట్రగుల్ పడుతునన హీరోగా నాగశౌర్యను చెప్పాలి. సినిమాల మీద ఇష్టంతో ఎలూరు నుంచి హైదరాబాద్ కు వచ్చిన నాగశౌర్య తాజాగా వార్తల్లోకి వచ్చారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్రహీరోల్లో ఒకరైన బాలయ్య మనసు పడిన ఒక టైటిల్.. ఇప్పుడీ యంగ్ హీరో సొంతమైందన్న వార్త ఆసక్తికరంగా మారింది.
బాలయ్య నటించాలని ఎంతో ఆశపడ్డ మూవీగా నర్తనశాలను చెప్పాలి. తన తండ్రి నటించిన ఈ చిత్రానికి రీమేక్ చేయాలని.. ఈ చిత్రంలో ద్రౌపతి పాత్రకు దివంగత నటి సౌందర్యను మొదట అనుకున్నారు. కారణాలు ఏమైనా ఆ చిత్రం పట్టాల మీదకు ఎక్కలేదు. బాలయ్య వందో సినిమాగా నర్తనశాల పేరు చర్చకు వచ్చింది.
ఈ సందర్భంగా ద్రౌపతిపాత్రకు నయనతార చేత చేయించాలన్న ఆలోచన చేసినట్లు చెబుతారు. అయితే.. గౌతమిపుత్ర శాతకర్ణి ప్రాజెక్టు తెర మీదకు రావటంతో నర్తనశాల వెనక్కి వెళ్లింది. తాజాగా ఈ చిత్ర టైటిల్ యంగ్ హీరో నాగశౌర్య చేతుల్లోకి వెళ్లినట్లుగా చెబుతున్నారు. అయితే.. ఈ నర్తనశాల పౌరాణికం కాదని.. సమకాలీన అంశాలతో రూపొందించనున్నట్లు తెలుస్తోంది. బాలయ్య ఎంతగానో మనసు పడిన సినిమా టైటిల్.. యంగ్ హీరో చేతులకు చేరటం ఆసక్తికరంగా మారింది.