Begin typing your search above and press return to search.
ఆ బ్లాక్ బస్టర్ కథ హీరో రాసిందేనట!
By: Tupaki Desk | 11 July 2019 4:22 AM GMTగత ఏడాది చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయంతో బ్లాక్ బస్టర్ సక్సెస్ సొంతం చేసుకున్న ఛలో నాగ శౌర్య కెరీర్ లోనే టాప్ గ్రాసర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. రష్మిక మందన్న స్టార్ కావడం దర్శకుడు వెంకీ కుడుములకు అవకాశాలు వెల్లువెత్తడం దీని వల్లే జరిగాయి. అయితే దాని తర్వాత నాగ శౌర్య మళ్ళి ఆ స్థాయి హిట్ కొట్టలేకపోయాడు. ఓ బేబీ ఆ లోటు తీర్చినప్పటికి అది సమంతా ఖాతాలోకి వెళ్లిపోవడంతో మరోసారి ఛలో మేజిక్ రిపీట్ చేయడం కోసం అశ్వద్ధామ రూపంలో రెడీ అవుతున్నాడు.
విశేషం ఏంటంటే దీనికి కథ నాగ శౌర్యదేనట. అదేంటి హీరో కథలు రాయడం ఏమిటా ఆని ఆశ్చర్యపోతున్నారా. కుర్రాడిలో ఆ టాలెంట్ కూడా ఉందట. ఈ విషయం స్వయంగా తనే చెబుతున్నాడు. మరో ట్విస్ట్ ఏంటంటే ఛలో కథ కూడా శౌర్య రాసిందేనట. కాకపోతే టైటిల్ కార్డ్స్ లో వేసుకోవడం ఇష్టం లేక కేవలం హీరో వరకే పరిమితమయ్యానని కొత్త సంగతి చెప్పాడు. చిన్న లైన్ వెంకీ కుడుములకు ఇస్తే అలా డెవలప్ చేశాడా లేక మొత్తం నాగ శౌర్యనే రాశాడో తెలియదు కాని మొత్తానికి చిన్న షాక్ అయితే ఇచ్చాడు.
అయితే ఛలో ప్రమోషన్స్ లో కాని పబ్లిసిటీలో కాని వెంకీ కుడుముల ఇది హీరో ఇచ్చిన కథేనని ఎక్కడా చెప్పలేదు. ఒకవేళ శౌర్యనే చెప్పాడో ఏమో తెలియదు కాని మొత్తానికి భాగ్యరాజా తరహాలో తన సినిమాలకు తన కథలు రాసుకుని నటించే ట్రెండ్ ని ఈ కుర్రహేరో మళ్ళి మొదలుపెడుతున్నట్టు ఉన్నాడు. తాము ఎలాంటి కథలకు సూట్ అవుతామో గుర్తించి దానికి తగ్గట్టు హీరోలే రాసుకోవడం మంచిదేగా.