Begin typing your search above and press return to search.
మోహన్ బాబు పొమ్మన్నారు.. నాగబాబు రమ్మన్నారు
By: Tupaki Desk | 6 March 2022 4:30 AM GMTటాలీవుడ్ లో ఎవరు ఎప్పుడు రమ్మంటారో ఎవరు ఎప్పుడు పొమ్మంటారో చెప్పడం కష్టం. ఇక్కడ శాశ్వత మిత్రులూ వుండరు.. శాశ్వత శత్రువులూ వుండరు. సమయం సందర్భాన్ని బట్టి ప్రధామ్యాలు మారుతుంటాయంతే. ప్రస్తుతం జరుగుతున్న సంఘటనలు ఇందుకు అద్దం పడుతున్నాయి.
వివరాల్లోకి వెళితే.. టాలీవుడ్ సీనియర్ హీరో మోహన్ బాబు, `మా` అధ్యక్షుడు, హీరో మంచు విష్ణు గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తున్నారు. `మా` ఎన్నికల వేళ వివాదం చెలరేగడంతో ఒక్కసారిగా మోహన్ బాబు, మంచి విష్ణు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచారు. మా ఎన్నికల్లో అధ్యక్ష పీఠానికి పోటీపడిన ప్రకాష్ రాజ్ తనకు మెగాస్టార్ చిరంజీవి అండ వుందని, ఆయన సపోర్ట్ వల్లే అధ్యక్షుడిగా కంటెస్ట్ చేయడానికి పోటీకి దిగానని ప్రకటించడం.. ఆ వెంటనే చిరు సపోర్ట్ తనకు కాదని, నాకే వుందని మంచు విష్ణు మీడియా ముఖంగా చెప్పడం.. అది గమనించిన మెగా బ్రదర్ నాగబాబు ఇండైరెక్ట్ గా పంచ్ లు వేసి ప్రకాష్ రాజ్ కే మా సపోర్ట్ అని బాహాటంగా చెప్పడం అప్పట్లో సంచలనంగా మారింది.
ఇదిలా వుంటే మంచు విష్ణు తన వ్యక్తిగత హెయిర్ స్టైలిస్ట్ నాగ శ్రీను 5 లక్షల విలువచేసే హెయిర్ డ్రెస్సింగ్ సంబంధించిన వస్తువులని మాయం చేశాడని ఆరోపిస్తూ జాబ్లీ హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడం కలకలాన్ని సృష్టించింది. ఎవరికీ చెప్పకుండా ఉన్నట్టుడి నాగశ్రీను వెళ్లిపోవడంతో అతనిపై అనుమానం కలిగిందని సదరు ఫిర్యాదులో మంచు విష్ణు మేనేజర్ సంజయ్ పోలీసులకు వెల్లడించారు. అయితే దీనిపై స్పందించిన నాగశ్రీను ...హీరో మోహన్ బాబు, మంచు విష్ణులపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఓ వీడియోని విడుదల చేయడం ఇప్పడు హాట్ టాపిక్ గా మారింది.
గత కొన్నేళ్లుగా హెయిర్ స్టైలిస్ట్ గా పని చేస్తున్న తనపై తప్పుడు కేసులు బనాయించారని, సాలరీ కూడా ఇవ్వలేదని, మోహన్ బాబు మోకాళ్లపై కూర్చోబెట్టి కాలితో తన్నుతూ బూతులు తిట్టారని, కావాలంటే సీసీ టీవీ ఫుటేజీని పరిశీలించమని, మంచు విష్ణు, మోహన్ బాబు చెప్పరాని విధంగా బూతులు తిట్టారకని, తనని వేధించారని, అవి నా నోటితో నేను చెప్పలేనని, తనపై తప్పుడు కేసులు బనాయించడంతో నా తల్లి గుండెపోటుకు గురైందని, తన వద్ద డబ్బులు లేవని, ఈ వీడియో చూసిన పెద్దలు తనకు న్యాయం చేయాలంటూ నాగ శ్రీను బోరుమన్నాడు.
దీనిపై నాయీ బ్రాహ్మణ సంఘం సీరియస్ గా స్పందించింది. మోహన్ బాబు, మంజు విష్ణు వివాదంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. నాగశ్రీనుని కులం పేరుతో దూషించడం అమానుషమని మోహన్ బాబు, మంచు విష్ణుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అంతే కాకుండా కర్నూలు లోని మానవ హక్కుల కమీషన్ లో మోహన్ బాబు, ఆయన తనయుడు మంచు విష్ణుపై ఫిర్యాదు చేయడం ఇప్పడు సంచలనం సృష్టిస్తోంది. ఈ సంఘటనకు ముందే నాగశ్రీను వీడియో పై మెగా బ్రదర్ నాగబాబు స్పందించారు.
నాగశ్రీను కుటుంబాన్ని పరామర్శించిన నాగబాబు తన వంతుగా అతనికి 50 వేల రూపాయల ఆర్థక సహాయాన్ని అందించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఈ ఫొటోలు గమనించిన నెటిజన్స్ మోహన్ బాబు పొయమ్మంటే నాగబాబు రమ్మంటూ అండగా నిలవడం ఆసక్తిని రేకెత్తిస్తోందని, ఆయన గొప్ప మనసుని నెటిజన్ లు అభినందిస్తున్నారు.