Begin typing your search above and press return to search.

'ఎన్టీఆర్-త్రివిక్రమ్' సినిమాకు బ్రేక్ పడిందనే వార్తలకు నిర్మాత కౌంటర్ ట్వీట్..!

By:  Tupaki Desk   |   5 April 2021 4:59 AM GMT
ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమాకు బ్రేక్ పడిందనే వార్తలకు నిర్మాత కౌంటర్ ట్వీట్..!
X
యంగ్ టైగర్ ఎన్టీఆర్ - డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ఓ మూవీ ప్రకటించిన సంగతి తెలిసిందే. హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్‌ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్స్‌ పై రాధాక‌ష్ణ‌ (చినబాబు) - నంద‌మూరి క‌ల్యాణ్‌ రామ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్లు వెల్లడించారు. ఈ చిత్రానికి 'అయినను పోయిరావలె హస్తినకు' అనే టైటిల్ కూడా ప్రచారంలో ఉంది. అయితే అప్పుడెప్పుడో ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినా ఇంతవరకు సెట్స్ పైకి రాకపోవడం పట్ల రకరకాల రూమర్స్ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం తారక్ నటిస్తున్న 'ఆర్.ఆర్.ఆర్' సినిమా షూటింగ్ పూర్తైన వెంటనే '#NTR30' స్టార్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని అందరూ భావించారు. అయితే తాజాగా ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమాకు బ్రేక్ పడిందంటూ కొన్ని మీడియాలలో న్యూస్ వచ్చింది.

ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ చేయబోయే సినిమాకు బ్రేక్ పడిందని.. దాదాపు 99 శాతం ఈ సినిమా ఆగిపోయినట్లేనని సదరు మీడియా వారు రాసుకొచ్చారు. అయితే ఈ వార్తలకు హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్‌ ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. 'అది నైస్ జోక్ గైస్' అంటూ నాగవంశీ ట్వీట్ చేస్తూ ఫన్నీ ఎమోజీస్ జత చేశారు. యువ నిర్మాత ఈ విషయాన్ని డైరెక్ట్ గా ప్రస్తావించనప్పటికీ సందర్భాన్ని బట్టి చూస్తే '#NTR30' పై వచ్చిన వార్తలను జోక్ లా తీసి పడేసాడని అర్థం అవుతోంది. నిజానికి నాగవంశీ ఇటీవల 'రంగ్ దే' ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. తారక్ - త్రివిక్రమ్ సినిమా ఏప్రిల్ ఎండింగ్ లేదా మే నెలలో ప్రారంభమవుతుందని.. టైటిల్, క్యాస్టింగ్ ఇంకా ఏదీ ఫైనల్ అవ్వలేదని చెప్పారు. ఇకపోతే తారక్ - త్రివిక్రమ్ సినిమాని వీలైనంత త్వరగా స్టార్ట్ చేసి ఇలాంటి వార్తలకు చెక్ పెట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు.