Begin typing your search above and press return to search.
అన్నయ్య శాంతం శాంతం అని మమ్మల్ని ఆపాడు:నాగబాబు
By: Tupaki Desk | 9 Jan 2019 3:28 PM GMTమెగా బ్రదర్ నాగబాబు చేపట్టిన మిషన్ బాలయ్య ఇప్పట్లో పూర్తయ్యేలా కనిపించడం లేదు. ఇప్పటికే చాలా ఇండైరెక్ట్ కౌంటర్లతో డైరెక్ట్ ఎటాక్ చేసిన నాగబాబు రీసెంట్ గా 'ఎర్రోడి వీరగాధ' అనే ఒక షార్ట్ ఫిలిం ను యూట్యూబ్ లో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరో వీడియోతో నెక్స్ట్ కౌంటర్ కు నాగబాబు ఇంట్రడక్షన్ ఇచ్చాడు.
ఇప్పటివరకూ ఒక్కసారి కూడా అయనను డైరెక్ట్ గా అనలేదని.. వల్లూరి బాలకృష్ణ పేరు చెప్తే వారిని అన్నానని అనుకున్నారు.. మేలుజాతి పశువుల ఫోటోలు పోస్ట్ చేస్తే వారినే అనుకుంటున్నారు.. బయోపిక్కులపై వేమన పద్యం చెప్తే వారినే అనుకుంటూ ఉన్నారు. ఎర్రోడి వీరగాధ షార్ట్ ఫిలిం కూడా వారిగురించే అనుకుంటున్నారు .. ఇలా ప్రతి ఒక్కదానికి వారినే అన్నానని గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుముకుంటున్నట్టుగా ఉంది వ్యవహారం అని చురకలేశాడు. బయోపిక్ లు చాలా ఉన్నాయి.. ఒక్క ఎన్టీఆర్ బయోపిక్ మాత్రమే కాదు.. మరి మీరు భుజాలు తడుముకుంటున్నారంటే 'నిజాలు లేవా?' అని ప్రశ్నించాడు.
ఎన్ని సార్లు మమ్మల్ని.. మా ఫ్యామిలీని డైరెక్ట్ గా అన్నా పెద్దగా స్పందించని మీడియా ఇప్పుడు నేను వారినే డైరెక్ట్ గా ఏమీ అనకున్నా 24 గంటలూ చర్చలు పెడుతోందని.. అదేం న్యాయం అని ప్రశ్నించాడు. తమను అవమానించిన ప్రతి సారి సమాధానం చెప్పాలని ఆవేశపడేవాళ్ళమని.. కాకపోతే ధర్మరాజు లాగా అన్నయ్య శాంతం శాంతం అని తమను ఆపేవాడని చెప్పుకొచ్చాడు. ఇంకా కౌంటర్ 6 ఉందని.. దాని కోసం అందరిని వేచి చూడమని కోరాడు. కౌంటర్ 6 తో ఈ ఎపిసోడ్ కు ఫుల్ స్టాప్ పెడతానని అన్నాడు.
తనకు పబ్లిసిటీ అవసరం లేదని.. నటుడిగా.. జబర్దస్త్ జడ్జి గా తనకున్న కాస్తో కూస్తో గుర్తింపు చాలన్నాడు. చిరు తమ్ముడిగా.. పవన్ అన్నయ్యగా.. వరుణ్ నాన్న గా ఎప్పుడు చెప్పుకోవాలని పెద్దగా ఆసక్తి చూపనని.. తనకు దగ్గర ఉండేవారికి ఈవిషయం తెలుసని అన్నాడు. మరి ఆ కౌంటర్ 6 లో ఏంటో.. ఎలాంటి ఘాటు చురక వేస్తాడో అని ఇప్పుడు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అంతలోపు నాగబాబు వీడియోను మీరు ఒకసారి చూడండి.