Begin typing your search above and press return to search.
బెనిఫిట్ షోల రద్దు ఎవరి పాపం? సీఎం జగన్ కి నాగబాబు క్లీన్ చిట్!
By: Tupaki Desk | 11 April 2021 5:55 PM GMTపవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన వకీల్ సాబ్ థియేటర్లలో రిలీజై బాక్సాఫీస్ వద్ద హవా సాగిస్తున్న సంగతి తెలిసిందే. ఓపెనింగ్ డే తర్వాతా రెండో రోజు వసూళ్లు మూడో రోజు బుకింగులు బావున్నాయన్న టాక్ వినిపిస్తోంది. ఇక ఈ సినిమాపై తాజాగా నాగబాబు రివ్యూ ఇచ్చారు. పవన్ నిజజీవితంలో ఉన్నట్టే తెరపై కనిపించారని ఆయన కితాబిచ్చారు.
అంతేకాదు ఈ సినిమా బెనిఫిట్ షోలు రద్దు చేయడంలో ఏపీ ప్రభుత్వ రాజకీయం ఉందన్న వాదనకు ఆయన చెక్ పెట్టారు. సీఎం జగన్ ఎన్నో పాలనాపరమైన సమస్యలతో ఉన్నారని ఆయన ఇలాంటి పని చేసి ఉండరని నాగబాబు కుండబద్ధలు కొట్టారు. కొందరు స్థానిక ఎమ్మెల్యేలు నాయకులు మాత్రమే ఇలాంటి పనులు చేసి ఉంటారని జగన్ కి అది తెలిసే అవకాశం లేదని కూడా నాగబాబు అన్నారు. సీఎంకి తెలిస్తే దీనిపై స్పందిస్తారని కూడా ఆయన అన్నారు.
సినీపరిశ్రమను రాజకీయం చేస్తే ఈ రంగంపై ఆధారపడిన ఎందరో కార్మికులు రోడ్డున పడతారని అలాంటి పనులు నాయకులు చేయకూడదని కూడా నాగబాబు చురకలు వేసారు. మొత్తానికి జగన్ కి నాగబాబు క్లీన్ చిట్ ఇచ్చారు.
వకీల్ సాబ్ రిలీజ్ ముందు మెలో డ్రామా అందరికీ తెలిసినదే. బెనిఫిట్ షోలను రద్దు చేయడమే గాక.. టికెట్ ధరల్ని తగ్గించేందుకు థియేటర్లకు నోటీసులు జారీ అయ్యాయి. వకీల్ సాబ్ కి ఇబ్బందులు కలిగించేందుకు ప్రయత్నం సాగిందని అభిమానులు తీవ్రంగా ఆరోపించారు. ఈ వివాదంలో కోర్టుల పాత్ర గురించి విధితమే.