Begin typing your search above and press return to search.

మూసుకొని మందుకోసం ఎదురుచూడండి

By:  Tupaki Desk   |   19 March 2020 9:50 AM GMT
మూసుకొని మందుకోసం ఎదురుచూడండి
X
కరోనా భయం తో ప్రపంచం మొత్తం వణికిపోతుంది. కరోనాకు ఇంకా మందు కూడా కనిపెట్టలేదు అని ప్రజలు వాపోతున్నారు. జనాలు బయట పనులకు పోలేక ఇంట్లోనే ఉండాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. సెలెబ్రిటీలు, రాజకీయ నాయకులు, ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగులు, దినసరి కూలిపని చేసేవాళ్ళతో సహా మొత్తం జనాభా ఇంటికే పరిమితమయ్యారు. పేద ప్రజలేమో పనుల్లేక బాధపడుతుంటే, కొందరు సెలెబ్రిటీలు మాత్రం తాపీగా ఇంట్లో కూర్చొని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

కరోనా మీద ఎవరికి తోచిన ప్రచారాలు వాళ్లు చేస్తున్నారు. ముఖ్యంగా సినీ ప్రముఖులు ఫేస్బుక్. ఇంస్టా, ట్విట్టర్ల లో వివాదాలకు కూడా దారితీస్తున్నారు. ఇటీవలే సినీనటుడు నాగబాబు ట్విట్టర్ ద్వారా కరోనా పై ఘాటుగా స్పందించాడు. "కరోనా వైరస్ ను అరికట్టే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, ప్రజల ఆరోగ్యం తో ఆడుకోవద్దంటూ తెలిపారు. ఇంకా ప్రజలు కూడా మా దేవుడంటే మా దేవుడే గొప్ప అనే చాదస్తపు మాటలు వాదనలు మానుకొని సైలెంట్ గా సైంటిస్టులు కనుక్కునే మందు కోసం ఎదురుచూడండి. దేవుళ్ళ ప్రతినిధులే ఏం పీకలేక మూసుకొని కూర్చున్నారు" అంటూ ట్వీట్లు చేసారు.

అయితే గతకొంతకాలంగా వివాదాస్పదమైన ట్వీట్ లతో విమర్శలకు గురవుతున్న నాగబాబు. ఇటీవల కరోనా పై స్పందించిన తీరు మాత్రం చర్చనీయాంశంగా మారింది. కరోనా బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం హై అలెర్ట్ ని ప్రకటించింది. కరోనా బారిన పడకుండా బతికారంటే మనిషి గొప్ప, పోయారంటే కరోనా గొప్ప అనే విధంగా ఉన్న ఆయన ట్వీట్లు ఎంతవరకు దారితీస్తాయో చూడాలి అంటున్నారు ప్రజలు. ఇకనైనా వివాదాలకు దూరంగా ఉంటే బాగుంటుందని అభిమానులు భావిస్తున్నారు.