Begin typing your search above and press return to search.
కత్తి - బాబు గోగినేనిపై నాగబాబు ఫైర్
By: Tupaki Desk | 8 July 2018 4:55 PM GMTమెగా ఫ్యామిలీలో అంతా సినిమాలపైనో లేదంటే రాజకీయాల పైనో దృష్టి పెడుతుంటే నాగబాబు మాత్రం హిందూ ధర్మ పరిరక్షణపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. హిందూ దేవుళ్లను కించపరిచేలా మాట్లాడేవారిని శిక్షించాలంటూ ఆయన డిమాండు చేస్తున్నారు. హిందూ దేవుళ్లను - ధర్మాన్ని అవమానిస్తున్నా ఎవరూ పట్టించుకోకపోవడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విదేశీయులు కూడా మన ధర్మం పట్ల ఆసక్తి పెంచుకుంటుంటే మనం మాత్రం తృణీకరిస్తున్నామంటూ ఆయన ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
నాస్తికత్వం - హేతువాదం పేరుతో బాబు గోగినేని - కత్తి మహేశ్ వంటివారు రాముడిని - ఇతర దేవుళ్లను అవమానించేలా మాట్లాడుతున్నారని నాగబాబు మండిపడుతున్నారు. ఇటీవల కత్తి మహేశ్ రాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆయనపై చర్యలు తీసుకోవాలని రెండు రాష్ట్రాల సీఎంలను ఆయన ఇప్పటికే డిమాండ్ చేశారు. తాజాగా ఆయన బ్రిటన్ కు చెందిన ఓ చిన్నారిని తీసుకొచ్చి లవకుశ చిత్రంలోని వినుడు వినుడు రామాయణ గాథ పాటను ఆయనతో పాడించారు.
బ్రిటన్ వంటి దేశాలకు చెందినవారే మన హిందూధర్మంపై ఇంతగా శ్రద్ధ చూపుతుంటే ఈ దేశంలో పుట్టినవారికి ఏమొచ్చిందంటూ ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వాలు కత్తి మహేశ్ వంటివారిపై చర్య తీసుకోకపోతే ప్రజలే బుద్ధి చెబుతారని.. ఆ తరువాత జరిగే పరిణామాలకు ఎవరూ బాధ్యులు కారంటూ ఆయన ఇంతకుముందు కూడా హెచ్చరించారు. మొత్తానికి కత్తి వంటివారు హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా నాగబాబు మాత్రం దీనిపై పోరాడేందుకు సిద్ధమంటున్నారాయన.