Begin typing your search above and press return to search.
మెగా డాటర్.. నాగబాబు నో అన్నారు
By: Tupaki Desk | 4 Dec 2015 6:24 AM GMTమెగా బ్రదర్ నాగబాబు తనయురాలు నీహారిక కొణిదెల కథానాయికగా ఆరంగేట్రం చేస్తున్న సంగతి తెలిసిందే. బుల్లి తెరపై ఢీ జూనియర్స్ రియాలిటీ షోతో మెరుపులు మెరిపించిన నీహారిక .. తెలుగు ప్రేక్షకుల్ని తనదైన ఆహార్యం, మాట తీరుతో ఆకట్టుకుంది. అందుకే తనకి కథానాయికగా ఛాన్సులొస్తున్నాయ్. ముందుగా యంగ్ హీరో నాగశౌర్య సరసన అవకాశం అందుకుంది. మల్లెల తీరంలో సిరిమల్లె పువ్వు డైరెక్టర్ రామరాజు ఈ చిత్రానికి దర్శకత్వం వహింస్తున్నారు.
అయితే నీహారిక మొదటి సినిమా రిలీజ్ కాకముందే తన ప్రతిభ గురించి టాలీవుడ్ సర్కిల్స్‌లో విస్ర్తతంగా చర్చ సాగుతోంది. నీహారికలో చక్కని ప్రతిభ దాగి ఉంది. నటనలో ఎంతో యాక్టివ్. తనతో సినిమా తీయాలంటూ నిర్మాతలంతా ఎంతో ఉత్సాహంగా ముందుకొస్తున్నారని టాక్. కాని ఇంకా మొదటి సినిమా రిలీజ్ కాకుండానే కొత్త ప్రాజెక్టులకు కమిటవ్వడం కరెక్ట్ కాదని తండ్రి నాగబాబు వారిస్తున్నారని తెలుస్తోంది. ఒక సినిమా తర్వాత ఇంకో సినిమాకి కమిటవ్వాలి. స్టెప్ బై స్టెప్ కెరీర్‌ని ముందుకు నడిపించాలని నాగబాబు సూచించారుట. ఇదే విషయాన్ని వరుణ్‌తేజ్‌కి కూడా నాగబాబు చెప్పారు. ఇప్పుడు కూతురికి సూచించారు. నీహారిక తండ్రి మాట జవదాటక ప్లాన్డ్‌గా సినిమాలకు సంతకాలు చేసేందుకు రెడీ అవుతోందని సమాచారం.