Begin typing your search above and press return to search.

నాగబాబొచ్చాడు.. వర్మ ఏం చేస్తాడు?

By:  Tupaki Desk   |   31 Jan 2017 8:25 AM GMT
నాగబాబొచ్చాడు.. వర్మ ఏం చేస్తాడు?
X
మెగా బ్రదర్ నాగబాబు పెద్ద షాకే ఇచ్చాడు. చడీచప్పుడు లేకుండా ఉన్నట్లుండి ట్విట్టర్లోకి ఎంట్రీ ఇచ్చేశాడు. ఆయన ట్విట్టర్లోకి రావడం పెద్ద విషయం కాదు కానీ.. ఇందుకు ఆయన ఎంచుకున్న టైమింగే చర్చనీయాంశం అవుతోంది. కొన్ని రోజుల కిందటే నాగబాబు రామ్ గోపాల్ వర్మ మెగా ఫ్యామిలీ మీద చేసే ట్విట్టర్ కామెంట్ల మీద విరుచుకుపడటం.. ఆపై వర్మ రివర్స్ కౌంటర్లివ్వడం తెలిసిందే. తాజాగా ఒక ఇంటర్వ్యూలో నాగబాబు మాట్లాడుతూ.. వర్మ ట్విటర్ని ఆయుధంగా వాడుకుంటాడని వ్యాఖ్యానించాడు. ఆ ఆయుధాన్ని తాను మాత్రం ఎందుకు వాడుకోకూడదు అనుకున్నాడో ఏమో.. ఆయన కూడా ట్విట్టర్లో ఖాతా తెరిచేశాడు.

ఇప్పుడిక ట్విట్టర్లో రామ్ గోపాల్ వర్మ.. నాగబాబుల మధ్య ఎలాంటి వాదనలు నడుస్తాయో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రీసెంట్ ఇంటర్వ్యూలో నాగబాబు ఆవేశపడకుండా ప్రశాంతంగా మాట్లాడాడు. వర్మ కామెంట్లన్నింటిపైనా కూల్ గా జవాబిచ్చాడు. ఆయన మళ్లీ స్వరం పెంచి ఉంటే వర్మ ఈపాటికే మళ్లీ ట్వీట్ దాడి మొదలుపెట్టేవాడేమో. వర్మ అన్నట్లు చిరంజీవిలో తాను 0.01 పర్సంట్ కాదు 0 పర్సంటే అని.. తాను అన్నయ్య మీద డిపెండ్ అవుతుండటానికి బాధపడట్లేదని.. వరుణ్ కు అసలు తాను సలహాలే ఇవ్వనని.. ఇలా దాదాపుగా సరెండర్ అయిపోయినట్లు మాట్లాడేశాడు దీంతో వర్మ సైలెంటైపోయాడు. ఐతే ‘ఖైదీ నెంబర్ 150’ కథ ముగింపు దశకు వచ్చింది కాబట్టి ప్రస్తుతానికి చిరు మీద ట్వీట్లు కట్టిపెట్టినప్పటికీ మళ్లీ ఏదో ఒక రోజు వర్మ కవ్వింపులకు దిగకపోడు. అప్పుడు నాగబాబు ఎలా రెస్పాండవుతాడు.. ప్రతిగా వర్మ ఎలా స్పందిస్తాడు.. వీళ్లిద్దరి మధ్య ట్వీట్ యుద్ధాలేమైనా జరుగుతాయా అని జనాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/