Begin typing your search above and press return to search.

'నిహారిక వేరే వాడి చేయి పట్టుకొని వెళ్లిపోయింది.. అప్పుడు అందర్నీ చంపేద్దాం అనుకున్నా'

By:  Tupaki Desk   |   18 Aug 2020 11:50 AM GMT
నిహారిక వేరే వాడి చేయి పట్టుకొని వెళ్లిపోయింది.. అప్పుడు అందర్నీ చంపేద్దాం అనుకున్నా
X
మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు ఏకైక కుమార్తె నిహారిక కొణిదెల‌ నిశ్చితార్థం ఇటీవల గ్రాండ్ గా నిర్వహించిన సంగతి తెలిసిందే. గుంటూరు జిల్లాకు చెందిన ఐజీ జొన్న‌ల‌గ‌డ్డ ప్ర‌భాక‌ర్ రావు త‌న‌యుడు జొన్న‌ల‌గ‌డ్డ వెంక‌ట చైత‌న్య‌తో మెగా డాటర్ ఎంగేజ్మెంట్ ఇరు కుటుంబ సభ్యుల స‌మ‌క్షంలో జ‌రిగింది. అయితే నిహారిక పెళ్లిని ఉద్దేశిస్తూ ఓ ఛానల్ లో 'బాపు బొమ్మకు పెళ్లంట' అనే ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించారు. దీనికి సంబంధించిన ప్రోమో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంట్లో నాగబాబు గతంలో జరిగిన ఇన్సిడెంట్ ని తలచుకొని నిహారిక కోసం ఆత్మహత్య చేసుకోవాలని అనిపించిందని ఎమోషనల్ అయ్యారు.

''ఒకసారి న్యూజిలాండ్ వెళ్లాను.. వాడెవడో నాలాగే నల్ల కోటు వేసుకోవడంతో వాడినే నాన్న అనుకుని వాడితో వెళ్లిపోయింది నిహారిక. దాదాపు 20 నిమిషాలు మిస్ అయింది నిహారిక. నాకు ఏమి చేయాలో అర్థం కాలేదు. నాకు ఎలా అనిపించింది అంటే.. మొత్తం న్యూజిలాండ్‌ లో ఉన్న వాళ్లందర్నీ చంపేద్దాం అనుకున్నా. వరుణ్‌ ని ఇంటికి పంపించేసి.. నేను, పద్మ సూసైడ్ చేసుకుని చనిపోదాం అనుకున్నాం. నా కూతురు లేకపోతే నేను ఉండి వేస్ట్ అన్నంత పిచ్చి వచ్చేసింది నాకు. ఎంతో పుణ్యం చేసుకుంటే ఏంజెల్స్ కూతురుగా పుడతారని అంటారు.. నిహారిక నా ఏంజెల్'' అంటూ కూతురిపై ఉన్న ప్రేమను తెలియజేసాడు నాగబాబు. దీనికి పక్కనే ఉన్న నిహారిక ఎమోషనల్ అయి లేచి వచ్చి నాగబాబు ఒళ్లో చిన్నపిల్లలా కూర్చుంది.

నాగబాబు నిహారిక నిశ్చితార్థం తర్వాత ఎమోషనల్ పోస్ట్ పెట్టిన సంగతి తెలిసిందే. ''కుమార్తెలు నీటిలో మన ప్రతిబింబం లాంటి వారు. మనం ఎంత ఎక్కువగా పట్టుకోవాలని చూస్తే అంత ఎక్కువ అలలు క్రియేట్ అవుతాయి. అందుకే వారిని వాళ్ళలాగే ఉండనివ్వండి. వారు పెరిగే క్రమంలో ప్రతి క్షణాన్ని ఆనందించండి. లవ్ యూ నిహా'' అని ట్వీట్ చేసారు. అంతేకాకుండా కాబోయే అల్లుడు చైత‌న్య‌ను ఉద్దేశిస్తూ ''డియ‌ర్ చై.. దాదాపు అన్ని విష‌యాల్లోనూ త‌ను అచ్చం నాలాగే ఉంటుంద‌ని అంతా అంటుంటారు. త‌న‌పై ఈ ప్ర‌పంచంలోని ప్రేమ‌నంతా నువ్వు కురిపిస్తావ‌ని న‌మ్ముతున్నా. ఈ రోజు నుంచి త‌ను నీ స‌మ‌స్య‌గా మారిపోయింది'' అంటూ ఆత్మీయ ట్వీట్ చేశారు.