Begin typing your search above and press return to search.
నాగబాబు తప్పు చెప్పిన కత్తి
By: Tupaki Desk | 19 April 2018 6:55 AM GMTనేనేం చేయాలన్నా? నేను చేస్తున్న పోరాటంపై స్పందించు అన్నా అంటూ శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలపై పవన్ రియాక్ట్ కావటం.. రోడ్ల మీదకు.. ఛానళ్ల దగ్గరకు వెళ్లే కన్నా.. న్యాయపోరాటం చేయ్.. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయ్ అంటూ పవన్ సలహా ఇవ్వటం.. దానిపై విరుచుకుపడి అసభ్యకరమైన మాట అనేయటం ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే.
శ్రీరెడ్డి అన్న మాటతో అప్పటివరకూ ఆమెకు మద్దతు పలికిన వారంతా వెనక్కి తగ్గటమే కాదు.. పవన్ కల్యాణ్ ను ఇష్టం వచ్చినట్లుగా అంత మాట అంటావా? అంటూ ఆమెపై ఫైర్ అయ్యారు. ఇలాంటి వేళలో కత్తిని సీన్లోకి తీసుకొచ్చిందో ఛానల్. పవన్ పై శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలు.. ఆ తర్వాత సారీ చెప్పిన వైనంపై కత్తి స్పందనను కోరారు.
పనిలో పనిగా తమ కుటుంబంపై పని కట్టుకొని టార్గెట్ చేస్తున్నారంటూ నాగబాబు ఆగ్రహం వ్యక్తం చేసిన వైనాన్ని సదరు ఛానల్ యాంకరమ్మ ప్రశ్నించింది. దీనిపై తనదైన శైలిలో రియాక్ట్ అయ్యారు కత్తి. పవన్ ను మొదట్నించి తప్పు పట్టే కత్తి తాజా ఎపిసోడ్ లోనూ భిన్నమైన వాదనను వినిపించారు.
శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలు.. వాడిన భాషను ఎవరూ అంగీకరించరని.. మరెవరూ సమర్థించరన్నారు. అంత మాత్రానికే ఇష్యూ పక్కదారికి వెళుతుందా? అంటే పక్కదారి పట్టిస్తున్నారని వ్యాఖ్యానించారు. శ్రీరెడ్డి.. తను చేసిన వ్యాఖ్యలపై పొద్దున్నే వివరణ ఇచ్చిందని.. ఇక దాని మీద మాట్లాడుకోవాల్సిన అవసరం లేదన్నట్లుగా తేల్చేశారు.
తాను కారులో వెళుతూ నాగబాబు ప్రెస్ మీట్ చూశానని.. అందులో తన తమ్ముడికి దమ్ముందని.. ఆయనేదో చూసుకుంటాడన్నట్లుగా మాట్లాడారన్నారు. నాగబాబు అలా మాట్లాడకుండా వాకాడ అప్పారావు అనే వ్యక్తి మీద కొన్ని ఆరోపణలు వచ్చాయని.. ఆయన తమ సంస్థకు చెందినవాడని.. తమ కుటుంబానికి కావాల్సిన వ్యక్తి అని.. ఆయన మీద ఆరోపణలు వచ్చాయని కాబట్టి ఆయన్ను తీసేసినట్లుగా చెప్పొచ్చు కదా? అని ప్రశ్నించారు.
అంతేకాదు.. ఎవరి మీదనైనా ఆరోపణలు వస్తే మేం సహించమని ఏమైనా చెప్పారా? అంటూ అదీ లేదు. ఇక్కడ ఎవరు చర్చను పక్కదారి పట్టిస్తున్నారంటే శ్రీరెడ్డి ఎంతమాత్రం కాదు. ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉందా? లేదా? అన్నది ఇష్యూ. క్యాష్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. అసలు ఏర్పాటు చేశారా? లేదా? అంటే.. లేదని చెప్పాలి. మరి.. పక్కదారి పట్టిస్తుంది ఎవరు? అంటే.. అది ఫిలిం ఇండస్ట్రీ.. ఛాంబరూ అని అంటానని చెప్పారు. మొత్తానికి చర్చను పక్కదారి పట్టించటంలో నాగబాబు తన ప్రయత్నం తాను చేస్తున్నారన్న విషయాన్ని కత్తి తనదైన శైలిలో చెప్పారని చెప్పక తప్పదు.