Begin typing your search above and press return to search.
మెగా ప్రిన్స్.. నాగబాబు రిజక్టు చేశాడే
By: Tupaki Desk | 19 May 2016 3:30 PM GMTనిన్న 'ఒక మనసు' ఆడియో లాంచ్ లో అనేక గమ్మత్తులు చోటుచేసుకున్నాయి. అసలు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన స్పీచ్ తో దద్దరిల్లిస్తాడు అనుకుంటే.. ఆయన చాలా సాఫ్టుగా లాగించేశాడు. ఇక మెగా బ్రదర్ నాగబాబు కూడా.. ఒక రియాక్షన్ తో అందరినీ కన్ఫ్యూజన్ లో పడేశాడు అంతే.
అప్పుడెప్పుడో చిరంజీవి ఒకానొక సందర్భంలో వరుణ్ తేజ్ ను 'ప్రిన్స్' అనడంతో.. చాలామంది అభిమానులు 'మెగా ప్రిన్స్' అనసాగారు. చివరకు నేషనల్ లెవెల్ లో వచ్చే టైమ్స్ ఆఫ్ ఇండియా వంటి పత్రికల్లో కూడా 'మెగా ప్రిన్స్' అంటూ మనోడ్ని సంభోదించడం అలవాటైపోయింది. కాకపోతే ప్రిన్స్ అనేది మహేష్ బాబు పేరు కదా.. ఇప్పుడు వరుణ్ తేజ్ ను అలా పిలవడం ఏంటి అనుకునే మెగా ఫ్యాన్స్ కూడా ఉన్నారు.
కట్ చేస్తే.. నిన్న నాగబాబు మాట్లాడుతూ.. మా అన్నయ్య అభిమానులకూ, మా తమ్మడు కళ్యాణ్ అభిమానులకూ.. రామ్ చరణ్ అభిమానులకూ.. స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులకూ.. అంటూ చెబుతుండగా.. వెనుక నుండి కొందరు మెగా ప్రిన్స్ అంటూ అరిచారు. కాని నాగబాబు మాత్రం 'అబ్బెబ్బే' అన్నట్లు ఆ పదాన్ని దాటేశారు. 'నీహా అభిమానులకు' అంటూ ఒకటి లాస్టులో యాడ్ చేశారు కాని.. ఈ ప్రిన్స్ అనే పదం మాత్రం చెప్పలేదు. అంటే సదరు ట్యాగ్ ఆయనకు ఇష్టం లేదా అంటూ సందేహం వ్యక్తపరుస్తున్నారు అభిమానులు.
ఆ లెక్కన చూస్తే.. మరి వరుణ్ తేజ్ కు ఏ ట్యాగ్ ను పెడతారో ఏంటో. సాయిధరమ్ తేజ్ లా బలవంతంగా ఏదైనా సుప్రీమ్ స్టార్ వంటి టైటిల్ ను తీసేసుకుంటాడా? మనోడు చేసే క్లాస్ సినిమాలకు అలాంటి టైటిళ్లు పెద్దగా సెట్టవ్వవేమో.