Begin typing your search above and press return to search.
మా అబ్బాయి ఏ పెళ్లి చేసుకున్నా సమ్మతమే: మెగాబ్రదర్
By: Tupaki Desk | 28 Jan 2021 3:30 AM GMTటాలీవుడ్ మెగాఫ్యామిలీలో ఒక్కొక్కరుగా పెళ్లి చేసుకుంటూ తీపికబుర్లు వినిపిస్తున్నారు. అయితే మెగా డాటర్ నిహారిక ఇటీవలే పెళ్లి చేసుకొని సెటిల్ అయింది. ఇంకా పెళ్లికి రెడీగా ఉన్నవారిలో సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ లతో పాటు నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ కూడా లైన్ లో ఉన్నాడు. అయితే ప్రస్తుతం వీరంతా హీరోలుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. మరి మంచి ఫామ్ లో ఉన్న ఈ మెగాఫ్యామిలీ హీరోలను పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు అని అడిగితే వారేం చెబుతారు. అందుకే వాళ్ళ పేరెంట్స్ ని కదిలిస్తే అసలు విషయాలు బయటికి వస్తాయి. తాజాగా ఓ టీవీ యాంకర్ మెగాబ్రదర్ నాగబాబును వరుణ్ పెళ్లి గురించి ప్రశ్నిచింది. ఇటీవలే కూతురు నిహారిక పెళ్లి చేసి బాధ్యత తీర్చేసుకున్నారు. మరి కొడుకు వరుణ్ సంగతేంటి? అనే ప్రశ్నకు..
నాగబాబు స్పందించి.. 'మా వరుణ్ ఎలాంటి పెళ్లి చేసుకున్నా పర్లేదు. అంటే ప్రేమపెళ్లి లేదా అరెంజ్ మ్యారేజ్ ఏదైనా ఓకే. కానీ అమ్మాయి వరుణ్ కి అన్నివిధాలా సరిజోడినా కాదా అనేది చూస్తాం' అంటూ కొడుకు పెళ్లి గురించి తన మనసులో మాటలు బయట పెట్టేసాడు నాగబాబు. ప్రస్తుతం వరుణ్ కెరీర్ సక్సెస్ ఫుల్ రన్ చేస్తున్నాడు. మరి వరుణ్ మనసులో ఏముంది అనేది ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ఈ హీరో ప్రస్తుతం గని, ఎఫ్3 సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ మధ్య కెరీర్ పరంగా చాలా జాగ్రత్తగా ముందుకు వెళుతున్నాడు వరుణ్. తన సినిమాల సెలక్షన్ బట్టి చూస్తేనే అర్ధమవుతుంది. ముకుంద, కంచె, తొలిప్రేమ, ఎఫ్2, అంతరిక్షం, గద్దలకొండ గణేష్.. ఇప్పుడు బాక్సింగ్ నేపథ్యంలో గని. ఈ సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంటున్నాడు మెగాహీరో. చూడాలి మరి పెళ్లి భోజనం విషయం ఎప్పుడు బయటపెడతాడో..!!