Begin typing your search above and press return to search.

మెగాస్టార్ బయోపిక్ గురించి బ్రదర్ మాట

By:  Tupaki Desk   |   14 Feb 2019 11:11 AM GMT
మెగాస్టార్ బయోపిక్ గురించి బ్రదర్ మాట
X
ఎప్పుడూ లేనిది ఇప్పుడు టాలీవుడ్ లో బయోపిక్ ల సీజన్ ఉదృతంగా నడుస్తోంది. మహానటి తర్వాత ఒకరిని మించి ఒకరు లెజెండ్స్ మీద పోటీ పడి సినిమాలు తీస్తున్నారు. అందులో ఎన్ని సక్సెస్ అవుతున్నాయి ఎన్ని పోతున్నాయి అనేది పక్కన పెడితే సరైన రీతిలో తెరకెక్కిస్తే కనక వర్షం కురిసే ఛాన్స్ ఉందని గుర్తించిన దర్శక రచయితలు వీటి మీద సీరియస్ గా దృష్టి పెట్టిన మాట వాస్తవం. సావిత్రి-ఎన్టీఆర్ కథలు అయిపోయాయి. కాంతారావుది నిర్మాణంలో ఉంది. అక్కినేని నాగేశ్వర్ రావుది తీసే సమస్యే లేదని నాగార్జున ఆల్రెడీ కుండ బద్దలు కొట్టేసారు.

సో ఇప్పుడు మెగాస్టార్ బయోపిక్ తీస్తే ఎలా ఉంటుందా అనే చర్చ అభిమానుల మధ్య రావడం సహజం. ఇటీవలే ఓ వెబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో మెగా బ్రదర్ నాగబాబుకు ఇదే ప్రశ్న ఎదురైంది. అయితే అన్నయ్యకు చరణ్ తనకూ అలాంటి ఆలోచనే లేదని జనాన్ని థియేటర్లు రప్పించేంత డ్రామా కాని ఓవర్ ఎమోషన్స్ కాని ఆయన లైఫ్ లో లేవని అందుకే ఆ ఉద్దేశం లేదని క్లారిటీ ఇచ్చేసాడు.

అయితే సినిమా జనం మాత్రం చిరంజీవి క్యారెక్టర్ ఆర్టిస్ట్ విలన్ నుంచి హీరోగా మారడానికి పడిన స్ట్రగుల్ అల్లు అమ్మాయిని చేసుకున్నాక గీత బ్యానర్ సహకారంతో స్టార్ గా ఎదిగిన వైనం ఖైది మేకింగ్ ఎదురుకున్న సాధక బాధలు తర్వాత ఎన్టీఆర్ కృష్ణ లెగసిని అందిపుచ్చుకోవడానికి పడిన కష్టం తదితరాలు అన్ని చూపించవచ్చు కదా అంటున్నారు. అంతే కాదు ప్రజా రాజ్యం ఎందుకు స్థాపించాల్సి వచ్చింది ఆఖరికి కాంగ్రెస్ లో కలిపేసి చివరికి సినిమాలకు కం బ్యాక్ ఇచ్చే దాకా జరిగిన అంతర్మధనాన్ని కవర్ చేయొచ్చుగా అని కూడా అంటున్నారు.

ఇవన్ని నాగబాబుకు తెలియదు అని కాదు కాని చిరు అభిమానుల అంచనాలను అందుకునేలా బయపిక్ తీయడం నిజంగా కత్తి మీద సామే. చరణ్ కు సైతం అంత బరువు మోసే వయసు కాదు. చేస్తే చిరునే ఆయన బయోపిక్ లో నటించాలి. లేదా నాగబాబు అన్నట్టు చేసే ఆలోచనే మానుకోవాలి. నిజమేగా