Begin typing your search above and press return to search.

నాగబాబు మళ్లీ ఫైర్ అయ్యాడు

By:  Tupaki Desk   |   19 Sep 2017 9:52 AM GMT
నాగబాబు మళ్లీ ఫైర్ అయ్యాడు
X
మెగా బ్రదర్ నాగేంద్ర బాబు రియాక్షన్స్ చాలా షార్ప్ గా ఉంటాయి. చెప్పే మాటలు క్రిస్ప్ గా ఉన్నా.. వాటిలో పదును చాలానే ఉంటుంది. అలాగే ఎలాంటి టాపిక్ పై అయినా రియాక్ట్ కావడంలో ఈయన పెద్దగా సందేహించడు. ఇప్పుడు మీడియాలో చక్కర్లు కొడుతున్న ఓ రూమర్ పై కూడా కాస్త ఘాటుగానే ప్రతస్పందిచాడు నాగబాబు.

మెగా మేనల్లుడిగా ఇండస్ట్రీలోకి వచ్చి మంచి విజయాలతో దూసుకుపోతూ.. ప్రామిసింగ్ హీరో అని బయ్యర్స్ తోను.. సుప్రీం హీరో అని మెగా ఫ్యాన్స్ తోను పిలిపించుకుంటున్నాడు సాయిధరం తేజ్. ఈ కుర్రాడితో నాగబాబు కూతురు నీహారిక పెళ్లి జరగనుందనే టాక్ కాస్త ఎక్కువగానే వినిపిస్తోంది. ఈ మేరకు ఇప్పటికే మెగా ఫ్యామిలీలో మాటా మంతీ జరుగుతున్నాయని కూడా అంటున్నారు. అయితే.. దీనిపై చాలా ఘాటుగా రియాక్ట్ అయ్యారు నాగబాబు. ఇది ఓ ఫూలిష్ న్యూస్ అన్న ఆయన.. అసలు అలాంటి అవకాశమే లేదని తేల్చి చెప్పేశారు.

నీహారిక చిన్నప్పుడు తేజు ఎత్తుకుని ఆడించాడని.. ఆమెను పెంచిన వ్యక్తుల్లో తను కూడా ఒకడు అన్న నాగబాబు.. వారిద్దరి మధ్య అన్నా చెల్లెళ్ల రిలేషన్ తప్ప మరేమీ లేదని తేల్చేశారు. ఈ విషయం కుటుంబం అంతా తెలుసు అని చెప్పిన మెగా బ్రదర్.. ఈ రూమర్ ను ఎవరో మూర్ఖుడు సృష్టించాడని తేల్చేశారు.