Begin typing your search above and press return to search.
'అరవింద..' లో నాగబాబుది ఆ పాత్రే!
By: Tupaki Desk | 31 July 2018 4:22 AM GMTదసరాకు రిలీజ్ కానున్న సినిమాల్లో సందడంతా యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమా 'అరవింద సమేత'ది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. వరస హిట్ల మీద ఉన్న ఎన్టీఆర్ - ఎలాగైనా హిట్ కొట్టి తీరాలన్న పట్టుదలతో ఉన్న త్రివిక్రమ్.. ఇద్దరూ మొదటి సారి కలిసి ఓ ఫ్యాక్షన్ నేపథ్యమున్న సినిమా చేస్తుండటంతో సహజంగానే ఆసక్తి నెలకొంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ - లీక్డ్ స్టిల్స్ సినిమాపై హైప్ ను పెంచాయి.
ఈ సినిమాలో నాగబాబు ఓ కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. లీకయిన స్టిల్ కూడా ఎన్టీఆర్-నాగబాబు మధ్య ఓ ఎమోషనల్ సీన్ ను రివీల్ చెయ్యడంతో అసలు ఈ సినిమాలో నాగబాబు ఏ పాత్ర పోషిస్తున్నాడన్న విషయం పై చర్చలు మొదలయ్యాయి. తాజా సమాచారం ప్రకారం నాగబాబు ఈ సినిమాలో ఓ గ్రామ సర్పంచ్ గా కనిపిస్తాడట. అంటే రాయలసీమ లో ఉన్న ఓ గ్రామం.. అక్కడ గ్రామ పెద్ద అన్నమాట. అంతే కాకుండా నాగబాబు ఎన్టీఆర్ తండ్రి పాత్రలో నటిస్తున్నాడని కూడా ఓ టాక్ వినిపిస్తోంది. మెగా బ్రదర్ ఎన్టీఆర్ సినిమాలో కీలక పాత్ర పోషిస్తుండడంతో అటు ఎన్టీఆర్ అభిమానుల్లోనూ ఇటు మెగా అభిమానుల్లో వాళ్ళ మధ్య వచ్చే సీన్స్ ఎలా ఉంటాయో అనే ఆసక్తి నెలకొంది.
ఈ సినిమాలో పూజా హెగ్డే - ఈష రెబ్బా హీరోయిన్లు. జగపతి బాబు - రావు రమేష్ - శ్రీనివాస్ రెడ్డి ఈ సినిమాలో ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీకి థమన్ సంగీతం అందిస్తున్నాడు. P. S. వినోద్ ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్.