Begin typing your search above and press return to search.

బ‌ల‌గం ధ‌న ప్ర‌భావంతో దిగ‌జారార‌ని నాగ‌బాబు ఆవేద‌న‌

By:  Tupaki Desk   |   12 Oct 2021 8:54 AM GMT
బ‌ల‌గం ధ‌న ప్ర‌భావంతో దిగ‌జారార‌ని నాగ‌బాబు ఆవేద‌న‌
X
మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) ఎన్నిక‌లు పూర్త‌యిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌కాష్ రాజ్ వ‌ర్సెస్ మంచు విష్ణు ప్యానెల్స్ నువ్వా నేనా? అంటూ పోటీప‌డ్డాయి. వార్ లో మంచు విష్ణు పై చేయి సాధించారు. అధ్య‌క్షుడిగా రేసులో గెలిచి ప‌ద‌విని చేప‌ట్టారు. ఇక ప్ర‌కాష్ రాజ్ ఓట‌మికి బాధ్య‌త వ‌హిస్తూ నాగ‌బాబు ఎమోష‌న‌ల్ అయిన సంగ‌తి తెలిసిందే. ఆయ‌న వెంట‌నే దీనికి బాధ్య‌త వ‌హిస్తూ `మా` ప్రాథ‌మిక‌ స‌భ్య‌త్వానికి రాజీనామా చేశారు. తొలుత ఓ ట్వీట్ ద్వారా ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. సంకుచిత మ‌న‌స్త‌త్వాలు ప్రాంతీయ వాదంతో కొట్టుమిట్టాడుతున్న మా సంఘంలో కొన‌స‌గ‌డం ఇష్టం లేద‌ని అందుకే రాజీనామా చేశాన‌ని ఆయ‌న ట్వీట్ చేశారు. త‌దుప‌రి లేఖ‌ను 48గంటల్లో అంద‌జేస్తానిని అన్నారు. తాజాగా రిలీజ్ చేసిన ఆ లేఖలో నాగ‌బాబు ఆవేద‌న ప్ర‌స్తుతం హాట్ టాపిక్ గా మారింది.

సోమవారం రాత్రి నాగబాబు తన రాజీనామా లేఖను సోషల్‌ మీడియా వేదికగా షేర్‌ చేశారు. ఇందులో రాజీనామా కార‌ణాలు చెబుతూ ప‌లు సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. నిష్ప‌క్ష‌పాతం.. వైవిధ్యంతో `మా` ఉండేది. దానిని ఎల్ల‌పుడూ అభిమానించాను. కానీ క‌ల్చ‌ర్ .. ప్రాంతాల క‌తీతంగా క‌ళాకారుల‌ను అక్కున చేర్చుకుని `మా` సొంతిల్లుగా వెలిగేది. ఇటీవలి కాలంలో మా సభ్యుల్లో కళాకారులుగా ఇటు మనుషులుగా అనూహ్య మార్పులు వచ్చాయి. ఈ అసహ్యకరమైన మార్పులు ఆశ్చర్యం క‌లిగించాయి. ఈ ఎన్నికలు నాలాంటి వారికి కనువిప్పు కలిగించాయి. బలగంతో పాటు ధన ప్రభావంతో అసోసియేషన్ సభ్యులు దారుణంగా దిగజారిపోయారు`` అంటూ విమ‌ర్శించారు. హిపోక్రాట్స్ .. స్టీరియోటైప్ స‌భ్యుల కార‌ణంగానే సంఘం నుంచి వెళ్లిపోవాల‌నుకున్నాను.. అని తెలిపారు.

ప్రకాష్ రాజ్ గురించి మాట్లాడుతూ.. ఎలాంటి స‌మ‌స్య‌నైనా ఎదుర్కొనే వ్య‌క్తి ప్ర‌కాష్ రాజ్. అలాంటి వ్య‌క్తి వెంటే ఎప్ప‌టికీ నిలుస్తాను. నా మ‌ద్ధ‌తు ఆయ‌న‌కే. గ‌డిచిన‌ పరిణామాల విష‌యంలో నేను బాధపడటం లేదు. అసోసియేషన్ భవిష్యత్ పైనే ఆందోళన చెందుతున్నా`` అని రాజీనామా లేఖ‌లో వెల్ల‌డించారు.