Begin typing your search above and press return to search.

కోడి కత్తి - గుడివాడ క్యాసినో అంటూ మళ్ళీ రచ్చ మొదలెట్టిన నాగబాబు..!

By:  Tupaki Desk   |   22 March 2022 9:30 AM GMT
కోడి కత్తి - గుడివాడ క్యాసినో అంటూ మళ్ళీ రచ్చ మొదలెట్టిన నాగబాబు..!
X
మెగా బ్రదర్ నాగబాబు సోషల్ మీడియాలో ఎంతో యాక్టీవ్ గా ఉంటారు. రాజకీయ సమకాలీన అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడిస్తుంటారు. ఈ క్రమంలో కొన్ని సార్లు వివాదాస్పద పోస్టులతో విమర్శలు కూడా ఎదుర్కుంటారు. ఈ మధ్య కాస్త గ్యాప్ ఇచ్చిన నాగబాబు.. ఇప్పుడు మళ్ళీ మొదలుపెట్టారు.

'ఇక మొదలెడదామా!' అంటూ సోమవారం రాత్రి ఇన్స్టాగ్రామ్ లో ప్రశ్నోత్తరాల కార్యక్రమం నిర్వహించిన నాగబాబు.. మీమ్స్ రూపంలో ప్రత్యర్థులపై విమర్శలు కురిపించారు. డైరెక్ట్ గా చెప్పకుండా ఎవరిని టార్గెట్ చేస్తున్నారో అందరికీ అర్థం అయ్యేలా సెటైర్లు వేశారు. నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు దానికి నాగబాబు ఇచ్చిన సమాధానాలు పరిశీలిస్తే...

- ఇన్ని రోజుల తర్వాత చిట్ చాట్ పెట్టడానికి కారణమేంటి?
నాగబాబు: హయ్యర్ పర్పస్ కోసం (ఇటీవల మెగా బ్రదర్ మీద మంచు మనోజ్ చేసిన కామెంట్స్ కు కౌంటర్)

- 'RRR'లో రాజమౌళి ఏం కత్తి వాడుతున్నారు సార్? అని ప్రశ్నించగా.. సమాధానంగా 'మేబీ' అంటూ కోడి కత్తి ఫొటో పోస్ట్ చేశారు నాగబాబు. పరోక్షంగా జగన్ మీద కోడి కత్తి దాడి మీద సెటైర్స్ వేశారని అర్థం అవుతుంది.

- కశ్మీర్ ఫైల్స్ సినిమా చూశాక మీ అభిప్రాయం?
నాగబాబు: ఆంధ్రా 3 రాజధానులు ఫైల్స్ అని ఒక సినిమా తీస్తే చూడాలని ఉంది.

- గోవాలో ఏ క్యాసినో బావుంటుంది మాస్టారూ?
నాగబాబు: అక్కడేమో నాకు తెలియదు. కానీ, ఈ మధ్య మన ఏపీలో స్టార్ట్ అయ్యిందని విన్నాను (దీనికి గుడివాడ జుంక్షన్ రైల్వే స్టేషన్ ఫోటోని షేర్ చేశారు)

- సన్నాఫ్ ఇండియా సినిమా గురించి ఒక్క మాటలో..? అనే ప్రశ్నకు 'చెప్పను బ్రదర్' అనే అల్లు అర్జున్ మీమ్ ని పోస్ట్ చేసారు.

- RRR ను ఫ్రీగా చూడాలంటే ఎలా?
నాగబాబు: ఎందుకు చూడలేం? చూడొచ్చు.. చరణ్ బదులు నాని.. ఎన్టీఆర్ బదులు శ్రీనివాస్.. ఇక దర్శకుడు ఎవరో మీకు చెప్పక్కర్లేదు! (పేర్ని నాని - అవంతి శ్రీనివాస్ లపై కౌంటర్ లా అనిపిస్తుంది)

- పోలీస్ కేసులు ఉంటే రాజకీయాల్లో సీట్లు వస్తాయా సార్?
నాగబాబు: ఖైదీలు ముఖ్యమంత్రులు అయిన దేశంలో పోలీస్ కేసులు ఒక లెక్కా!

- సామాన్యుడు కోసం తగ్గించాం అన్నారు.. ఇప్పుడు పెంచారు.. ఈ ప్రభుత్వం ఏంటి?
నాగబాబు: మీరేంటో, మీ విధానాలు ఏంటో నాకు అర్థం కావు అనే 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాలోని రావు రమేష్ డైలాగ్ చెప్పే ఫోటోని షేర్ చేశారు.

- సహజ మరణం అంటే ఏంటి?
నాగబాబు: కల్తీ సారా తాగి చనిపోవడం, కత్తులతో గొడ్డలితో గాయపడి చనిపోవడం, పంటలు పండక పురుగుల మందు తాగి చనిపోవడం, గతుకుల రోడ్డు వల్ల ప్రమాదాలు జరిగి చనిపోవడం (ఏపీలో పరిస్థితులు - వైఎస్ వివేకా హత్యలను ప్రస్తావించారని తెలుస్తోంది)

- పోర్న్ అంటే మీకు గుర్తొచ్చేది ఏంటి?
నాగబాబు: పబ్లిక్ లో ఇవి మాట్లాడటానికి నాకు ఇబ్బందిగా ఉన్నా... ఈ మధ్య నాకొక రాజకీయ నాయకుడు గుర్తు వస్తాడు (ఇటీవల కొంత మంది రాజకీయ నాయకుల వాట్సాఫ్ కాల్ స్క్రీన్ షాట్స్ వైరల్ అయిన విషయం తెలిసిందే)

- మన ముఖ్యమంత్రి పాలన బాగుందంట నిజమేనా? అనే దానికి సమాధానంగా 'డీజే టిల్లు' సినిమాలో 'నువ్వు ఈ క్వశ్చన్ నన్ను నిజంగానే అడుగుతున్నావా రాధికా?' అనే మీమ్ ని పోస్ట్ చేసారు.

- ఒక్క ఛాన్స్ గురించి మీ అభిప్రాయం?
నాగబాబు: ఇచ్చినందుకు బాగా దింపారుగా!

- కాకినాడ మడతకాజా కళ్యాణ్ గారి గురించి ఏదో మాట్లాడుతున్నారు. ఏమై ఉంటుంది? అని అడగ్గా.. 'పిచ్చి కుక్క కరించింది' అనే అర్థం వచ్చేలా ఒక ఫొటో పోస్ట్ చేశారు.

ఇప్పుడు ఈ ప్రెసిడెంట్ మెడల్ ఉంది కదా? అలాగే, పద్మశ్రీ బ్రాండ్ ఉంటుందా? అనే ప్రశ్నకు.. ఉంటది ఉంటది అంటూ జలీల్ ఖాన్ ఫొటో పోస్ట్ చేశారు. వైసీపీలో మిస్టర్ పర్ఫెక్ట్ పొలిటిషన్ ఎవరైనా ఉన్నారా? అని అడగ్గా.. ఓ ఎద్దు ఫోటోని షేర్ చేశారు నాగబాబు.

ఇలా మంచు మనోజ్ మొదలుకొని వైసీపీ ప్రభుత్వం మరియు సీఎం జగన్ మోహన్ రెడ్డి మీద నాగబాబు పరోక్షంగా సెటైర్స్ వేశారని నెటిజన్స్ అభిప్రాయ పడుతున్నారు. కోడి కత్తితో పాటు ఏపీలో క్యాసినో నిర్వహణ - లిక్కర్ బ్రాండ్స్ ప్రస్తావన తీసుకురావడాన్ని ఉదాహరణలుగా చెబుతున్నారు.

అదే సమయంలో ఈ ప్రశ్నలు నాగబాబు ముందుగానే రెడీ చేసి.. ఫ్యాన్స్ తో అడిగించారనే సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఏదైతేనేం నాగబాబు మళ్లీ రచ్చ మొదలుపెట్టారు. దీనిపై రాబోయే రోజుల్లో ఎలాంటి చర్చ జరుగుతుందో చూడాలి.