Begin typing your search above and press return to search.
సాహో కాంపౌండ్ లో చైతు ఎంట్రీ ?
By: Tupaki Desk | 17 July 2019 6:39 AM GMTతెలుగులోనే అత్యంత భారీ యాక్షన్ మూవీ నిర్మించిన సంస్థగా సాహో వల్ల యువి బ్యానర్ రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోతోంది. మొదట్లో శర్వానంద్ లాంటి హీరోలతో సినిమా నిర్మాణం సాగించినా ఆపై వెనుక ఉన్న ప్రభాస్ ను ముందుకు తేవడంతో స్నేహితులు కం నిర్మాతలు సక్సెస్ అయ్యారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా సాహో మీద ఎడతెగని ఆసక్తి ఉంది. దీంతో పాటు రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాసే హీరోగా మరో సినిమా తీస్తున్న యువి నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కోసం లైన్ సిద్ధం చేసుకుంటున్నట్టుగా టాక్.
ఇదే సంస్థకు గతంలో ఎక్స్ ప్రెస్ రాజాతో సూపర్ హిట్ ఇచ్చిన దర్శకుడు మేర్లపాక గాంధీతో ఓ మూవీ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలిసింది. హీరోగా నాగ చైతన్యను గట్టిగా ట్రై చేస్తున్నారట. నాని కృష్ణార్జున యుద్ధం తర్వాత గాంధీ గ్యాప్ తీసుకుని ఈ స్క్రిప్ట్ ని రూపొందించాడు. కానీ చైతు కమిట్ అయిన సినిమాలతో చాలా బిజీగా ఉన్నాడు. వెంకీ మామ పాటలు మినహా దాదాపు పూర్తయ్యిందని న్యూస్. దీని తర్వాత శేఖర్ కమ్ముల సినిమాలో జాయిన్ అవ్వాలి. అది పూర్తి చేయడానికి ఎంత లేదన్నా ఐదారు నెలలు పడుతుంది .
ఆలోగా నాన్నతో కలిసి చేయాల్సిన బంగార్రాజు పెండింగ్ ఉంది. స్క్రిప్ట్ ఆల్రెడీ లాక్ అయిపోయింది. దర్శకుడు కళ్యాణ్ కృష్ణ వెయిటింగ్ లో ఉన్నాడు. ఇవన్నీ కొలిక్కి రావడానికి ఎంత లేదన్నా ఏడాది పడుతుంది. మరి గాంధీ యూవీ అంతకాలం వెయిట్ చేస్తారా అనేది సస్పెన్స్. ఒకవేళ కుదరకపోతే నెక్స్ట్ ఆప్షన్ గా సాయి తేజ్ ను కూడా పెట్టుకున్నట్టు తెలిసింది. ఇదంతా తేలాలంటే కనీసం వెంకీ మామ నుంచి చైతు ఫ్రీ అయితే అప్పుడు క్లారిటీ వస్తుంది