Begin typing your search above and press return to search.
నాకు డౌట్ ఉండేది .. నాన్నను నమ్మాను అంతే!
By: Tupaki Desk | 13 Jan 2022 5:08 PM GMTనాగార్జున - నాగచైతన్య ప్రధాన పాత్రలను పోషించిన 'బంగార్రాజు' రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. కల్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా, గ్రామీణ నేపథ్యంలో నడుస్తుంది. మొదటి నుంచి కూడా పండుగలాంటి సినిమా అని చెబుతూ, సంక్రాంతిలో పండుగకు తీసుకుని వస్తున్నారు. ఈ నేపథ్యంలో కొంతసేపటి క్రితం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ముఖ్య అతిథులంటూ ఎవరూ లేకుండానే, చాలా సింపుల్ గా ఈ వేడుకను నిర్వహించారు. ఈ వేదికపై చైతూ మాట్లాడాడు.
'రారండోయ్ వేడుక చూద్దాం' సినిమాతో కల్యాణ్ కృష్ణ నన్ను మీ అందరికీ దగ్గర చేశాడు. ఈ సినిమాతో నేను మీ అందరికీ ఇంకా దగ్గరవుతానని అనుకుంటున్నాను. ఆ సినిమా బ్రేకప్ సీన్లో ఏదైతే ఎనర్జీ ఉంటుందో .. ఈ సినిమాలోని ప్రతి సీన్లో అదే ఎనర్జీ ఉంటుంది. బంగారంలాంటి క్యారెక్టర్ పడినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాను మేము సెప్టెంబర్ లో స్టార్ట్ చేశాము. అప్పుడు నేను నాన్నను అడిగాను .. "నాన్నా నిజంగానే ఈ సినిమాను మనం సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నామా" అని. 'నన్ను నమ్మురా' అనే ఒకే మాట ఆయన అన్నారు.
ఇక అప్పటి నుంచి నేను నాన్నను నమ్మాను. నాన్న అన్నట్టుగానే సంక్రాంతికి సినిమా రెడీ అయింది. నాన్నపై నాకున్న నమ్మకం మరింత పెరిగింది. రమ్యకృష్ణ గారు అద్భుతంగా చేశారు. కృతి శెట్టి సర్పంచ్ నాగలక్ష్మిగా నటించింది. ఆమె రోల్ అదిరిపోతుంది. తప్పకుండా మీ అందరూ థియేటర్లో భలేగా ఎంజాయ్ చేస్తారు. దక్ష సాంగ్ ను కూడా మీరు ఎంజాయ్ చేస్తారు. మా సినిమా రిలీజ్ రోజున మీరు ఎంత ఎనర్జీతో ఉంటారో .. అదే ఎనర్జీ ఈ సినిమాలో ఉంటుంది. పండగలాంటి సినిమా అని ప్రతిసారి ఎందుకు చెబుతున్నామనేది సినిమా చూసిన తరువాత మీకు అర్థమవుతుంది.
సంక్రాంతి పండుగ కోసమే నాన్న ఈ సినిమాను డిజైన్ చేశారు. సంక్రాంతి పండుగ వస్తుందంటే చాలు, అంతా కూడా మంచి సినిమా చూసి ఎంజాయ్ చేయాలనుకుంటూ ఉంటారు. అలాంటి సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తుంటారు. మీరంతా ఆశించిన ఆ సినిమా ఇదే అవుతుంది .. ఈ సినిమాలో మీరు కోరుకునే ఆ ఎంటర్టైన్మెంట్ కచ్చితంగా ఉంటుంది. మీ అందరూ థియేటర్లకు వెళ్లి సినిమా చూడండి. 'వాసివాడి తస్సాదియ్యా' అని అరుస్తూ బయటికి రావడం ఖాయం" అంటూ చెప్పుకొచ్చాడు.