Begin typing your search above and press return to search.
రియల్ లైఫ్ పాత్రలో నాగచైతన్య..?
By: Tupaki Desk | 7 Feb 2022 2:30 AM GMTయువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ లు అందుకుని ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు. కోవిడ్ సమయంలో `లవ్ స్టోరీ`తో సక్సెస్ అందుకోగా...సంక్రాంతి కానుకగా `బంగార్రాజు`తో బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్నాడు. త్వరలో `థాంక్యూ `చిత్రంతో హిట్ అందుకుని హ్యాట్రిక్ హీరోగా ప్రూవ్ చేసుకోవాలని వెయిట్ చేస్తున్నాడు.
ఇటీవలే ఈ సినిమా షూటింగ్ యూరప్ షెడ్యూల్ తో ముగిసింది. ఇందులో చైతన్య మూడు రకాల షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపించనున్నాడని సమాచారం. పాత్రల మధ్య వేరియేషన్స్ చూపించడంలో విక్రమ్ కె. కుమార్ ప్రత్యేకత చాటుకుంటారని గత సినిమాలే నిరూపించాయి.
ఈ నేపథ్యంలో చై పాత్ర చాలా ఇంట్రెస్టింగ్ గా సాగుతుందని...గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో చైకి కొత్త ఇమేజ్ ని తీసుకొచ్చే చిత్రంగా నిలుస్తుందని `థాంక్యూ` పై అంచనాలు ఏర్పడుతున్నాయి. `థాంక్యూ` థీమ్ ఏంటన్నది ఇంకా తెలియాల్సి ఉంది. చైతన్య రియల్ లైఫ్ కి దగ్గరగా ఉండే కథ ఇది అని సమాచారం ఉంది. మంచి ఫీల్ గుండ్ ఎంటర్ టైనర్ అవుతుందని అభిమానులు నమ్మకంతో ఉన్నారు. మరి చైతన్య ఆ నమ్మకాల్ని ఎంత వరకూ నిలబెడతారో చూడాలి. అక్కినేని ఫ్యామిలీతో విక్రమ్ కి మంచి అనుబంధం ఉంది. అక్కినేని ఫ్యామిలీకి మరుపు రాని `మనం`లాంటి సక్సెస్ ఇచ్చారు.
ఏఎన్నార్ చివరి చిత్రంగా టాలీవుడ్ చరిత్రలోనే `మనం` నిలిచిపోయింది. ఆ తర్వాత అఖిల్ తో `హలో` చిత్రాన్ని తెరకెక్కించి యావరేజ్ సక్సెస్ ని ఇచ్చాడు. ఆ నమ్మకంతోనే నాగచైతన్య- విక్రమ్ తో జర్నీ చేస్తున్నాడు. `థాంక్యూ` తర్వాత ఇదే కాంబినేషన్ లో ఓ హార్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ కూడా రాబోతుంది. ఇదే మూవ్ మెంట్ లో బాలీవుడ్ లోనూ `లాల్ సింగ్ చద్దా`తో ఎంట్రీ ఇస్తున్నాడు. అమీర్ ఖాన్ కథానాయకుడిగా నటిస్తోన్న ఈ చిత్రంలో చైతన్య కీలక పాత్రలో కనిపించనున్నాడు. అలా ఈ ఏడాది చైకి అంతా పాజిటివ్ వైబ్ కనిపిస్తోంది.