Begin typing your search above and press return to search.
స్పీడు పెంచిన నాగచైతన్య
By: Tupaki Desk | 26 Oct 2021 4:30 AMటాలీవుడ్ క్రేజీ జంట నాగచైతన్య - సమంత తాము విడిపోతున్నట్టుగా ప్రకటించి అందరికి షాకిచ్చిన విషయం తెలిసిందే. వీరు ప్రకటన చేసి దాదాపు 20 రోజుల పైనే అవుతోంది. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా మారిపోయారు. సామ్ తీర్థ యాత్రలు చేస్తూ బిజీగా వుంటే చై కూడా మరో పక్క బిజీ బిజీగా గడిపేస్తున్నాడు. ఇటీవలే `లవ్ స్టోరీ` చిత్రంతో సూపర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్న కెరీర్ పరంగా ఫుల్ జోష్‌లో వున్న చైతన్య తన తదుపరి ప్రాజెక్ట్ లపై దృష్టిపెట్టాడు.
ఇదే ఏడాది బాలీవుడ్ బాటపడుతున్న చై ఇందుకు సంబంధించిన ఏర్పాట్లలో బిజీగా మారిపోయాడు. ఇప్పటికే బాలీవుడ్ మిస్టర్ పర్ ఫెక్ట్ అమీర్ ఖాన్ నటిస్తున్న `లాల్ సింగ్ చద్దా`ని పూర్తి చేసి నాగచైతన్య తన తదుపరని సినిమా కోసం రెడీ అవుతున్నాడు. సామ్‌తో విడిపోతున్నానని ప్రకటించిన నాగచైతన్య ఇప్పటికే సొంత ఫ్లాట్ ని కొనేసుకుని అందులోకి తన మకాం మార్చేశాడు. సిటీలోని గచ్చిబౌలి ఏరియాలో సొంత ఫ్లాట్‌ని తీసుకున్న నాగచైతన్య ఇటీవలే అందులోకి మకాం మార్చినట్టుగా తెలిసింది.
పనిలో పనిగా చై ఓ వెబ్ సిరీస్ కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. మంచి కథాబలమున్న వెబ్ సిరీస్ ని చై ఓకే చేసినట్టుగా తెలిసింది. దీనితో పాటు తండ్రి నాగార్జునతో కలిసి `బంగార్రాజు`లో నటిస్తున్నాడు నాగచైతన్య.. ఇదే కాకుండా విక్రమ్ కె. కుమార్ డైరెక్షన్ లో దిల్ రాజు నిర్మిస్తున్న `థ్యాంక్యూ`లోనూ నటిస్తున్న విషయం తెలిసిందే.
చై.. సామ్ విడాకుల గురించి ప్రకటించిన వెంటనే సామ్ ప్రవర్తన.. తన వ్యక్తిగత కాస్ట్యూమర్ ప్రీతమ్ జుగల్ తో సామ్ సాన్నిహిత్యంగా వున్న ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. సామ్ గోవాలోని ఓ రిసార్ట్ లో ప్రీతమ్ ఒడిలో కాళ్లు పెట్టుకుని పడుకున్న ఫొటోలు కొత్త చర్చకు దారితీశాయి. దీంతో వెంటనే ఆ ఫొటోలని సామ్ తొలగించింది. దీంతో రంగంలోకి దిగిన శ్రీరెడ్డి ప్రీతమ్ జుగాల్కర్ ఓ గే అని అనుమానం వ్యక్తం చేస్తూ ఓ సంచలన వీడియోని పోస్ట్ చేయడం తెలిసిందే.