Begin typing your search above and press return to search.

వాసివాడి తస్సాదియ్యా.. 'బంగార్రాజు' గా చైతూ అదరగొట్టేసాడు..!

By:  Tupaki Desk   |   22 Nov 2021 1:30 PM GMT
వాసివాడి తస్సాదియ్యా.. బంగార్రాజు గా చైతూ అదరగొట్టేసాడు..!
X
కింగ్ అక్కినేని నాగార్జున - యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య కలయికలో వస్తున్న తాజా చిత్రం ''బంగార్రాజు''. 'సోగ్గాడు మళ్ళీ వచ్చాడు' అనేది దీనికి ఉపశీర్షిక. కల్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. 2017లో ఘనవిజయం సాధించిన 'సోగ్గాడే చిన్ని నాయనా' కు ఇది సీక్వెల్. ఇందులో సీనియర్ నటి రమ్యకృష్ణ - యంగ్ బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇటీవలే విడుదలైన 'లడ్డుండా' సాంగ్ ‏మరియు కృతి శెట్టి లుక్ అనూహ్య స్పందన తెచ్చుకున్నాయి. ఈ క్రమంలో లేటెస్టుగా అభిమానులకు తాజాగా అదిరిపోయే సర్ప్రైజ్ వచ్చింది.

రేపు నవంబర్ 23న నాగచైతన్య పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ.. ఈరోజు 'బంగార్రాజు' చిత్రం నుంచి యవసామ్రాట్ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. 'వాసివాడి తస్సాదియ్యా.. గుండెల్లో గిత్తలు కుమ్ముతున్నట్టు లేదూ?' అంటూ వదిలిన ఈ పోస్టర్ ఫ్యాన్స్ ని విశేషంగా ఆకట్టుకుంటోంది. చైతూ ఇందులో రంగురంగుల చొక్కా ధరించి లైట్ గా మీసాలు తిప్పి మాస్ లుక్ లో కనిపించారు. బంగార్రాజు స్టైల్ లోనే కర్రను విసురుతూ నాగార్జునను గుర్తు చేశారు. కాకపోతే నాగ్ పంచె కట్టులో ఉంటే ఇక్కడ చై మాత్రం జీన్స్ వేసుకొని ట్రెండీగా ఉన్నారు.

ఫస్ట్ లుక్ పోస్టర్ ని బట్టి నాగచైతన్య ఇందులో బంగార్రాజు పాత్రలో కనిపిస్తారని తెలుస్తోంది. ఐదేళ్ల క్రితం బంగార్రాజుగా నాగ్ సందడి చేయగా.. ఈసారి తండ్రీకొడుకులు ఇద్దరూ బంగార్రాజులుగా అలరించడానికి వస్తున్నారని సందేహాలు కలుగుతున్నాయి. రేపు మంగళవారం ఉదయం 10.23 గంటలకు ఈ సినిమా టీజర్‌ ను విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. టీజర్ తో ఈ సినిమాలో బంగార్రాజు పాత్ర గురించి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

'బంగార్రాజు' చిత్రాన్ని జీ స్టూడియోస్ సమర్పణలో అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై అక్కినేని నాగార్జున నిర్మిస్తున్నారు. సత్యానంద్ ఈ సినిమాకి స్క్రీన్ ప్లే అందిస్తుండగా.. అనూప్ రూబెన్స్ సంగీతం సమకూరుస్తున్నారు. జె యువరాజ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్ గా.. రామ్ లక్ష్మణ్ ఫైట్ మాస్టర్స్ గా వర్క్ చేస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న 'బంగార్రాజు' చిత్రాన్ని సంక్రాంతి బరిలో నిలిపే అవకాశం ఉందని ప్రసారం జరుగుతోంది.