Begin typing your search above and press return to search.
నాగచైతన్య థాంక్యూ.. అదీ సంగతి!
By: Tupaki Desk | 3 Sep 2021 2:30 AM GMTహీరో నాగ చైతన్య బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. కెరీర్ పరంగా క్షణం తీరిక లేనంత బిజీ. మనం దర్శకుడు విక్రమ్ కుమార్ దర్శకత్వంలో అతడు థాంక్యూ చిత్రంలో కనిపించనున్నారు. సినిమా షూటింగ్ లో ఎక్కువ భాగం కొన్ని నెలల క్రితం పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి.
తాజా సమాచారం మేరకు.. థాంక్యూలో చైతన్య మూడు విభిన్న అవతారాలలో కనిపిస్తారు. సినిమా రచయిత బివిఎస్ రవి జీవితంలోని అనేక కోణాల్లో సాగే పాత్రను తీర్చిదిద్దారని.. చివరికి కథ సాగే కొద్దీ కథానాయకుడు అనుకున్నది సాధిస్తాడని చిత్ర రచయిత బివిఎస్ రవి వెల్లడించారు.
రాశి ఖన్నా- అవికా గోర్-మాళవిక నాయర్ ఇందులో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ భారీ ప్రాజెక్ట్ ను దిల్ రాజు నిర్మిస్తున్నారు. మేకర్స్ సినిమా విడుదల ప్రణాళికలను ఇంకా ప్రకటించాల్సి ఉంది.
బంగార్రాజు ఆ లోటు తీర్చేనా!
మనం లాంటి మరో సినిమా చేసేందుకు అక్కినేని కాంపౌండ్ సాహసించలేదు. అలాగే దర్శకులు వద్ద అలాంటి స్క్రిప్టులు లేవు. కానీ నాగార్జున-నాగచైతన్య- సమంతలను కలుపుతూ కళ్యాణ్ కృష్ణ `బంగార్రాజు` స్క్రిప్టును రాసుకున్నారని ఇంతకుముందు కథనాలొచ్చాయి. మనం మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ ఈ సినిమాకి ఒప్పించారు. కానీ అనూహ్యంగా సమంతకు ఈ చిత్రంలో స్కోప్ లేదని చైతన్య సరసన కృతి శెట్టి కథానాయికగా నటిస్తుందని ప్రకటించడంతో అక్కినేని అభిమానుల్లో చర్చనీయాంశమైంది. గ్గాడే చిన్న నాయనా 2016లో రిలీజైంది. ఇంతకాలానికి ఆ చిత్రానికి ప్రీక్వెల్ తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో కృతి శెట్టి చైతూకి జంటగా నటిస్తుండగా రమ్య కృష్ణ సహా మరో హీరోయిన్ కూడా నాగ్ కి జతగా నటించనున్నారు.
ఇకపోతే చైతన్య - సమంత జంట మధ్య ఏదో జరుగుతోందని కతతలున్నాయని ఇటీవల కథనాలొచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై చైతన్య కానీ సమంత కానీ సరిగా క్లారిటీ ఇవ్వకపోవడం అనుమానాలు రేకెత్తిస్తోంది.
తదుపరి చైతన్య నటించిన లవ్ స్టోరి త్వరలో రిలీజ్ కానుంది. సమంత ఇటీవలే `శాకుంతలం` చిత్రీకరణను ముగించి తదుపరి విరామంలో ఉన్నారు. నయన్ -విఘ్నేష్ ల తమిళ ప్రాజెక్ట్ లోనూ సామ్ నటించిన సంగతి తెలిసినదే. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కి రానుంది.