Begin typing your search above and press return to search.

నాకూ బాలయ్యకూ ఏమీ లేవ్ -నాగార్జున

By:  Tupaki Desk   |   9 April 2017 4:06 AM GMT
నాకూ బాలయ్యకూ ఏమీ లేవ్ -నాగార్జున
X
టిఎస్సార్ టివి9 అవార్డుల కార్యక్రమం సాక్షిగా ఇప్పుడు ఒక కొత్త విశేషం బయటకొచ్చింది. అసలు ఇన్నాళ్ళూ టాలీవుడ్ లో బీభత్సంగా ప్రచారంలో ఉన్న ఒక రూమర్ ఫుల్ స్టాప్ పడినట్లయ్యింది. అదేంటంటే.. చాలాకాలం నుండి బాలకృష్ణ అండ్ నాగార్జున ఒకరితో ఒకరు మాట్లాడుకోవట్లేదనేది రూమర్. అందుకు తగ్గట్లుగానే ఏఎన్నార్ మరణించినపుడు బాలయ్య రాలేదు.. అలాగే బాలయ్య ఇంట్లో జరిగిన పెళ్లికి నాగ్ అండ్ ఫ్యామిలీ దూరంగా ఉన్నారు. కాని ఇదంతా కేవలం అనుకోకుండా అలా జరిగిందే తప్పితే.. వాస్తవంగా అక్కడ ఏమీ లేదని నాగార్జున మాటలను బట్టి అర్ధం చేసుకోవచ్చు.

గత రాత్రి జరిగిన అవార్డ్స్ ఫంక్షన్లో మాట్లాడిన నాగ్.. ''చాలామంది అసలు బాలయ్యకు నాకూ పడట్లేదని.. ఏదో ఏదో అనుకుంటున్నారు. పిచ్చి పిచ్చి రూమర్లు చాలా వినిపిస్తున్నాయి. కాని అటువంటిది ఏమీ లేదు. స్టేజీ మీద చెబుతున్నాం'' అంటూ స్టేజ్ సాక్షిగా క్లారిఫికేషన్ ఇచ్చేశారు. ఈయన సదరు స్పీచ్ ఇస్తున్నప్పుడు.. వెంటనే బాలయ్య కూడా దగ్గర వచ్చి ఆప్యాయంగా భుజంపై చేయేసి.. ''మా మధ్యన అలాంటిదేం లేదు. మేం స్నేహితులం'' అంటూ తన హావభావాలతోనే చెప్పేశారు.

మొన్ననే గౌతమిపుత్ర శాతకర్ణి ఓపెనింగ్ కు చిరంజీవి వెళ్ళడం.. అంతకంటే ముందు చిరు60 ఈవెంట్లో బాలయ్య డ్యాన్సులు.. తరువాత చిరు కోసం నాగ్ ప్రెస్ మీట్ పెట్టి మరీ 150పై పొగడ్తలు.. ఇక 150లో చేయాలనుకుని మిస్సయ్యానంటూ వెంకీ చెప్పడం.. ఇప్పుడు బాలయ్య అండ్ నాగ్ కలసి ఇలా జాయింట్ స్టేట్మెంట్ ఇవ్వడం.. చూస్తుంటేనే టాలీవుడ్ చాలా చూడముచ్చటగా ఉంది గురూ!!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/