Begin typing your search above and press return to search.
ప్రేమమ్ ట్వీట్ గురించి నాగ్ కు సెటైర్ వేస్తే..
By: Tupaki Desk | 20 Oct 2016 3:30 AM GMT‘ప్రేమమ్’ సినిమాను సామాన్య ప్రేక్షకుల కంటే ముందే చూశాడు అక్కినేని నాగార్జున. చూసిన వెంటనే చాలా హ్యాపీగా ఇంటికెళ్తున్నా అని ట్వీట్ కూడా పెట్టాడు. ఐతే ఈ ట్వీట్ మీద కొందరు సెటైర్ వేశారట. దాని గురించి ‘ప్రేమమ్’ సక్సెస్ మీట్లో చెప్పాడు నాగ్. ‘‘ప్రేమమ్ సక్సెస్ కావడం చాలా హ్యాపీ. ఫస్ట్ కాపీ చూసినపుడే కచ్చితంగా సక్సెస్ అవుతుందన్న నమ్మకం కలిగింది. వెంటనే డైరెక్టర్ చందూకు కంగ్రాట్స్ చెప్పాను. తర్వాత సినిమా చూసి హ్యాపీగా ఇంటికి వెళ్తున్నా అని ట్వీట్ కూడా చేశాను. ఐతే కొంతమంది దీని గురించి చిత్రంగా స్పందించారు. ‘ప్రేమమ్’ చూసి హ్యాపీగా ఇంటికెళ్తున్నారా.. లేక ఇంటికి వెళుతున్నందుకు హ్యాపీగా ఉన్నారా అని అడిగారు. ‘ప్రేమమ్’ చూడడం వల్లే హ్యాపీగా ఇంటికెళ్తున్నా అని చెప్పాను’’ అని నాగ్ అన్నాడు.
ఇక దర్శకుడు చందూ మొండేటి గురించి నాగ్ మాట్లాడుతూ.. ‘‘ఇలాంటి సినిమాను రీమేక్ చేయడానికి గట్స్ కావాలి. చందూ మన నేటివిటికి తగ్గట్టు చాలా బాగా తీశాడు. చాలామంది చైతన్యతోనో.. అఖిల్ తోనో ‘శివ’ సినిమా తీయచ్చు కదా అంటుంటారు. కానీ అలాంటి సినిమాను మళ్లీ తీయలేం. ‘చంద్రముఖి’ సినిమాను ఓరిజనల్లో ఉన్నట్లు తీస్తే ఆడేది కాదు. ఐతే ‘ప్రేమమ్’ కథలోని సోల్ తీసుకుని చందూ మన నేటివిటీకి తగ్గట్టు అద్భుతంగా మార్చి తీశాడు. చందు నా ఫ్యాన్ కదా. అందుకే డైలాగ్స్ బాగా రాశాడు. సైకిల్ చైన్ డైలాగ్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ‘ప్రేమమ్’ సినిమా రీమేక్ అనగానే తమిళం.. మలయాళ ఆడియన్స్ చాలా కామెంట్లు చేశారు. మన క్లాసిక్ మూవీని వాళ్లు రీమేక్ చేసినా మనం అలాగే కామెంట్లు చేస్తాం. ఐతే మలయాళ ‘ప్రేమమ్’ కంటే గొప్పగా తీద్దాం అని కాకుండా తెలుగు ప్రేక్షకులకు ఒక మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీని అందిద్దాం అనే ఉద్దేశంతోనే ఈ సినిమా తీస్తున్నాం అని చైతన్య చెప్పాడు’’ అని నాగ్ అన్నాడు.
ఇక తన కొడుకు నాగచైతన్య గురించి స్పందిస్తూ.. ‘‘ఈ సినిమా చివర్లో ఒక డైలాగ్ ఉంటుంది. కొడుకు సంతోషం కన్నా తండ్రికి ఏం కావాలి అని. ఇప్పుడు అదే చెబుతున్నా. చైతన్యకు సక్సెస్ రావడం కన్నా నాకు ఇంకేం కావాలి. నేను బాగా నటిస్తే కొడుకు కదా అని నాన్నగారు నన్ను పొగిడేవారు కాదు. కానీ నేను నా కొడుకును పొగుడుతున్నాను. చైతన్య అద్భుతంగా నటించాడు’’ అని నాగ్ చెప్పాడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/