Begin typing your search above and press return to search.
సీనియర్ హీరో వందవ మూవీ పరిస్థితేంటీ?
By: Tupaki Desk | 9 Oct 2022 12:30 AM GMTసీనియర్ హీరోలంతా మళ్లీ ఒక్కొక్కరుగా ట్రాక్ లోకి వచ్చేస్తున్నారు. గత ఏడాడి డిసెంబర్ వరకు వరుస ఫ్లాపుల్లో వున్న నందమూరి బాలకృష్ణ గత ఏడాది డిసెంబర్ లో విడుదలైన `అఖండ` మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకుని మళ్లీ ట్రాక్ లోకి వచ్చేశారు. బోయపాటి శ్రీను తెరకెక్కించిన ఈ మూవీ బాలయ్య కెరీర్ లోనే అత్యధిక వసూళ్లని రాబట్టిన సినిమాగా నిలిచి సరికొత్త రికార్డుని సొంతం చేసుకుంది. ఇక మరో సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ కూడా వరుస బ్లాక్ బస్టర్ లతో రేసులో ముందున్నారు. చేసుకున్నారు.
గత ఏడాది `నారప్ప`, దృశ్యం 2` సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ లని తన ఖాతాలో వేసుకున్న వెంకటేష్ ఈ ఏడాది `ఎఫ్ 3`తో హిట్ ని సొంతం చేసుకున్నాడు. ఇక ఈ ఏడాది `ఆచార్య`తో డిజాస్టర్ ని ఎదుర్కొన్న మెగాస్టార్ రీసెంట్ గా దసరా బరిలో నిలిచి `గాడ్ ఫాదర్`తో హిట్ ని సొంతం చేసుకుని మళ్లీ సక్సెస్ ట్రాక్ లోకి వచ్చేశారు. అయితే ఈ ముగ్గురు సీనియర్స్ రిటర్న్ టు బ్యాక్ అంటూ సక్సెస్ లతో మళ్లీ ట్రాక్ లోకి వచ్చేస్తే కింగ్ నాగార్జున మాత్రం తడబడుతూ ఫ్లాప్ లని దక్కించుకుంటున్నారు.
`సోగ్గాడే చిన్నినాయన` మూవీతో బ్లాక్ బస్టర్ ని దక్కించయుకుని తొలిసారి రూ. 50 కోట్ల క్లబ్ లో చేరిన నాగార్జున ఆ తరువాత ఆ స్థాయి విజయాన్ని అందుకోలేదు. ఇప్పటికీ ప్రయత్నాలు చేస్తున్నారే కానీ ఆ స్థాయి బ్లాక్ బస్టర్ ని సొంతం చేసుకోలేక బాక్సాఫీస్ వద్ద దడబడుతున్నారు. వర్మతో చేసిన `ఆఫీసర్` నుంచి నాగ్ వరుసగా ఫ్లాపుల్ని ఎదుర్కొంటున్నారు. కొత్తగా ప్రయత్నాలు చేసినా ఏవీ ఫలించడం లేదు. వర్మని నమ్మి చేసిన `ఆఫీసర్` మూవీతో చాలా వరకు నష్టపోయిన నాగ్ దాని నుంచి బయటపడాలని ప్రయత్నాలు చేస్తూనే వున్నాడు.
కానీ ఏ ప్రయత్నం ఫలించకపోగా క్రమ క్రమంగా నాగ్ మార్కెట్ ని డౌన్ ఫాల్ చేస్తూ వస్తోంది. దసరా సీజన్ లో రిలీజ్ అయిన `ది ఘోస్ట్` చెప్పుకోదగ్గ ఓపెనింగ్స్ ని రాబట్టలేక చతికిలబడిపోయింది. దీనికి తోడు డివైడ్ టాక్ రావడంతో ఈ మూవీ పరిస్థితి మరింత దారుణంగా మారింది. టీజర్, ట్రైలర్ తో `గాడ్ ఫాదర్`ని మించి పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్న `ది ఘోస్ట్` రిలీజ్ రోజు మాత్రం ఆ సినిమా కు దరిదాపుల్లో కూడా వసూళ్లని రాబట్టలేకపోవడం నాగ్ అభిమానుల్ని కలవరానికి గురిచేస్తోంది.
ఈ నేపథ్యంలో నాగ్ వందవ ప్రాజెక్ట్ పరిస్థితి ఏంటనే కామెంట్ లు వినిపిస్తున్నాయి. `ది ఘోస్ట్` ఓ మోస్తారు స్థాయి ఓపెనింగ్స్ ని కూడా రాబట్టలేకపోవడంతో వందవ సినిమా సమయంలో ఈ ట్విస్ట్ లేంటీ? అంఊ అభిమానులు కంగారు పడుతున్నారట. పరిస్థితి ఇలా వుంటే వందవ సినిమా పరిస్థితి ఏంటనే చర్చ ఇప్పడు అభిమానుల్లో మొదలైంది? మరి వందవ సినిమా అయినా నాగ్ ని సక్సెస్ ట్రాక్ ఎక్కిస్తుందోమో తెలియాలంటే వేచి చూడాల్సిందే.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.