Begin typing your search above and press return to search.
పెద్ద స్టార్ అయినా చెత్త సినిమాని కాపాడలేరు
By: Tupaki Desk | 14 Jan 2022 5:03 AM GMTస్టార్ డమ్ తో ఆరంభ వసూళ్లు దక్కుతాయేమో కానీ ఆ తర్వాత విజయం వరిస్తుందని చెప్పలేం. సినిమా కథ కంటెంట్ తో పాటు నటీనటుల ప్రదర్శన మ్యూజిక్ సహా ఇంకా ఎన్నో కలిసి రావాలి. అన్నీ బావున్నా ఫేట్ సరిగా లేకున్నా అంతే సంగతి. ఇలాంటి అనుభవాలెన్నో ఫిల్మీ జనం చూస్తుంటారు. ఇక నిర్మాతగా స్టార్ హీరోగా నాగార్జునకు కూడా అనుభవాలు కోకొల్లలు. అదే అనుభవంతో ఆయన ఓ మంచి మాట చెప్పారు ఇప్పుడు.
నాగ్ ఒక బాలీవుడ్ ఛానెల్ తో మాట్లాడుతూ.. ఈ సంక్రాంతికి విడుదలవుతున్న బంగార్రాజు సినిమా విజయంపై తనకు చాలా నమ్మకం ఉందని.. ఇది పండుగ చిత్రం కాబట్టి.. సరైన సమయంలోనే రిలీజ్ చేస్తున్నామని కూడా అన్నారు. కాలం మారిందని.. విడుదలైన ఒక గంటలో సినిమా గురించిన టాక్ బయటికి వచ్చేస్తోందని కూడా నాగ్ అన్నారు. ఈ రోజుల్లో సినిమా చెడిపోతే పెద్ద స్టార్ అయినా కూడా కాపాడలేడు అన్నారు నాగార్జున.
పరిశ్రమ అగ్ర హీరోగా ఆయనకు ఇలాంటి అనుభావాలెన్నో. అందుకే ఆ అనుభవంతో క్లారిటీగా ప్రతిదీ చెబుతున్నారు. నేడు (14 జనవరి) బంగార్రాజు థియేటర్లలో విడుదలవుతున్న సంగతి తెలిసిందే. కృతి శెట్టి కథానాయికగా నటిస్తున్న బంగార్రాజు చిత్రంలో నాగ్ తనయుడు చైతన్య అక్కినేని ఒక హీరోగా నటించారు. మనం లాంటి క్లాసిక్ తర్వాత తండ్రి కుమారులు కలిసి నటించిన ఈ సినిమాపై బోలెడంత హైప్ ఉంది. దాదాపు 40కోట్ల మేర ప్రీరిలీజ్ బిజినెస్ ని సాగించిన ఈ చిత్రం 50 కోట్లు పైగా వసూలు చేయాల్సి ఉంది.