Begin typing your search above and press return to search.
మీ ప్రేమ ముందు కలెక్షన్లు ఎంత?
By: Tupaki Desk | 19 Jan 2022 3:23 AM GMTనాగార్జున కథానాయకుడిగా కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రూపొందిన 'బంగార్రాజు' .. సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ నెల 14వ తేదీన థియేటర్లకు వచ్చింది. తొలి రోజునే హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా, మూడు రోజుల్లోనే 50 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. పండుగ తరువాత కూడా ఈ సినిమా అదే జోరును కొనసాగిస్తూ ఉండటం విశేషం. ఈ నేపథ్యంలో ఈ సినిమా టీమ్ రాజమండ్రిలో 'బ్లాక్ బస్టర్ మీట్'ను ఏర్పాటు చేసింది. ఈ వేదికపై నాగార్జున 'ఈ సినిమాకి హైలైట్ గా నిలిచిన 'వాసివాడి తస్సాదియ్యా' అనే డైలాగ్ తోనే మాట్లాడటం మొదలుపెట్టారు.
"మా కల్యాణ్ కృష్ణ 'సోగ్గాడే చిన్నినాయనా' సినిమాలో ఒక డైలాగ్ రాశాడు .. ఇప్పుడు ఒకసారి చెబుతాను. మీ అందరినీ చూస్తుంటే ఎలా అనిపిస్తుందో తెలుసా? గుండెల్లో గిత్తలు కుమ్మేస్తున్నాయ్. ప్రపంచమంతా భయపడింది .. ఇలాంటి పరిస్థితుల్లో సినిమా రిలీజ్ చేస్తే చూస్తారా అని. నార్త్ ఇండియాలో సినిమాలు రిలీజ్ చేయడం ఆపేశారు. అప్పుడు తెలుగు సినిమా లవర్స్ అంతా కూడా 'మీరు సంక్రాంతికి సినిమా రిలీజ్ చేయండి మేము చూస్తాము .. మీకు బ్లాక్ బస్టర్ ఇస్తాము' అని చెప్పారు. అలాంటి తెలుగు ప్రేక్షకులందరికీ పాదాభివందనాలు.
ఈ సినిమా విజయం .. ఈ సినిమా గెలుపు నాపై నాకు గల నమ్మకమని యూనిట్ లోని వాళ్లంతా నన్ను పొగుడుతున్నారు. ఇది నా మీద నాకున్న నమ్మకం కాదు .. నాకు మీ మీద ఉన్న నమ్మకం. తెలుగు ప్రేక్షకుల మీద ఉన్న నమ్మకం. సంక్రాంతి అంటే సినిమా .. సినిమా అంటే సంక్రాంతి అని మళ్లీ ఒకసారి రుజువు చేశారు. రాజమండ్రిలో సినిమా ఇంకా హౌస్ ఫుల్స్ పడుతున్నాయని విన్నాను. నేను కలెక్షన్ల గురించి మాట్లాడటానికి రాలేదు. మీ ప్రేమ గురించి మాట్లాడటానికి వచ్చాను. మీ ప్రేమ ముందు కలెక్షన్లు ఎంత .. నథింగ్.
మీరు చూపించే ప్రేమ .. ఆదరణ కంటే ఏం కావాలి? ఇది చూసినప్పుడు నాకు కానీ .. నాగచైతన్యకి గానీ .. అఖిల్ కి గాని, మా నాన్న అక్కినేని నాగేశ్వరరావుగారికి ఇంకోసారి థ్యాంక్స్ చెప్పుకోవాలనిపిస్తుంది. ఎందుకంటే ఇదంతా ఆయన మాకు ఇచ్చారు. మొన్న నా మిత్రులు చిరంజీవిగారితో మాట్లాడాను. ఏంటి చిరంజీవిగారు .. మీరు వైఎస్ జగన్ గారిని కలిసి వచ్చారు .. ఏం మాటలాడుకున్నారని? 'సినిమా ఇండస్ట్రీకి అంతా మంచే జరుగుతుందని జగన్ గారు చెప్పినట్టుగా నాతో అన్నారు. ఈ వేదిక ద్వారా జగన్ గారికి థ్యాంక్స్ చెబుతున్నాను.
'బంగార్రాజు' ఒక అచ్చమైన తెలుగు సినిమా. పంచెకట్టుతో .. మన సంబరాలతో .. మన సరసాలతో నడిచే అచ్చమైన తెలుగు సినిమా. 'బంగార్రాజు' మేము కాదు .. మా నాన్నగారు. ఆయన ఇక్కడే ఎక్కడో నిలబడి ఉన్నారు. ఈ సంబరాన్నంతా చూస్తున్నారు. ఆయనకి ఇంకోసారి నమస్కారం చెప్పుకుంటున్నాను. ఫిల్మ్ ఇండస్ట్రీకి రెండు కళ్లు .. ఒకటి నందమూరి తారకరామారావు గారు .. రెండు అక్కినేని నాగేశ్వరరావు గారు. ఇవాళ నందమూరి తారకరామారావుగారి వర్ధంతి. తెలుగు సినిమా ఉన్నంతవరకూ ఆయనను మనం గుర్తుచేసుకోవాలి .. గుర్తుచేసుకుంటాం. అలాగే ఏఎన్నార్ ను కూడా గుర్తు చేసుకుంటాము. థ్యాంక్యూ రాజమండ్రి .. మీ ప్రేమకు .. మీ అనురాగానికి" అంటూ ముగించారు.