Begin typing your search above and press return to search.
చిరుపై సెటైర్లు.. నాగ్ జాగ్రత్త పడ్డాడు
By: Tupaki Desk | 31 Jan 2017 6:02 PM GMTనిజానికి ప్రత్యేక పాత్రలు.. క్యామియోలు అన్నీ కలుపుకుంటే మెగాస్టార్ చిరంజీవికి ‘బ్రూస్‌లీ’నే 150వ సినిమా. కానీ హీరోగా ఆయన రీఎంట్రీ మూవీనే 150వ సినిమాగా ఉంటే బాగుంటుందని ‘బ్రూస్‌లీ’ని విస్మరించింది మెగా క్యాంప్. ఈ విషయంలో సోషల్ మీడియాలో ఒకానొక సమయంలో పెద్ద చర్చే నడిచింది. చిరు అండ్ కోపై సెటైర్లు కూడా పడ్డాయి. గతంలో క్యామియో రోల్స్ చేసిన సినిమాల్ని కలుపుకుని ‘బ్రూస్ లీ’ని మాత్రం పక్కన పెట్టడం ఏంటంటూ జనాలు ప్రశ్నలు లేవనెత్తారు. ఈ పరిణామాలు చూసి అప్రమత్తమయ్యాడో ఏమో.. నాగార్జున తన వందో సినిమాపై చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్లున్నాడు. తన వందో సినిమా ఏదన్నది తాను మాత్రమే చెబుతానని.. అభిమానుల లెక్కల్ని.. డిమాండ్లను పట్టించుకోనని అంటున్నాడు నాగ్.
‘‘అభిమానుల లెక్కల్లో అయితే నేను వందో సినిమాకు దగ్గరల్లో ఉన్నాను కానీ నేను గెస్ట్ రోల్ చేసిన సినిమాలను కూడా నా సినిమాగా లెక్కేయడం కరెక్ట్ కాదు అని నా అభిప్రాయం. అలాగే నేను వాయిస్ ఓవర్ ఇచ్చిన సినిమాలు కూడా ఉంటాయి. ఇవన్నీ లెక్కలోకి తీసుకోకూడదు. నాకంటూ ఓ లెక్క ఉంది. ఆ లెక్క 100కి వచ్చినప్పుడు నేనే నా వందో సినిమా ఇది అని ఎనౌన్స్ చేస్తాను. నా వందో సినిమా ఏదో నేను డిసైడ్ చేస్తా తప్ప అభిమానులు కాదు’’ అని నాగ్ స్పష్టం చేశాడు.మొత్తంగా వందో సినిమా విషయంలో వివాదాలకు తావు లేకుండా క్రిస్టల్ క్లియర్ గానే ఉన్నట్లున్నాడు నాగ్. ఐతే ఆయన అతిథి పాత్రలతో కలుపుకుంటే ప్రస్తుతం విడుదలకు సిద్ధమైన ‘ఓం నమో వెంకటేశాయ’ 92వ సినిమా అవుతుందని అభిమానుల లెక్క.