Begin typing your search above and press return to search.
మమ్ముట్టి చేశారంటే ఏజెంట్ హిట్టే: నాగార్జున
By: Tupaki Desk | 24 April 2023 10:12 AM GMTఅక్కినేని వారసుడు అఖిల్ ఏజెంట్ గా మన ముందుకు రావడానికి సిద్ధమయ్యాడు.ఈ సినిమా ఏప్రిల్ 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా, ఆదివారం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఘనంగా నిర్వహించారు. ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి నాగార్జున ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. అలాగే తెలంగాణ మంత్రి ఎర్రెబల్లి దయాకర్ రావు కూడా హాజరయ్యారు. కాగా, ఈ సినిమా కచ్చితంగా హిట్ అవుతుందని నాగార్జున ఆశాభావం వ్యక్తం చేశారు. మమ్ముట్టి ఈ సినిమాలో నటించారంటేనే ఆ సినిమా హిట్ అని ఆయన పేర్కొనడం గమనార్హం.
తాము కొత్త జానర్‌లో మంచి సినిమా చేసినప్పుడల్లా ప్రేక్షకులు దాన్ని బ్లాక్‌బస్టర్‌గా రూపొందిస్తున్నారని నాగార్జున సంతోషం వ్యక్తం చేశారు. ఏజెంట్ సినిమాని దర్శకుడు సురేందర్ రెడ్డి గూఢచారి జానర్‌లో ప్రేక్షకుల ముందుకకు తీసుకువచ్చాడని ఆయన అన్నారు. తాను కూడా ఈ సినిమా చూడలేదని, కనీసం సినిమా స్టోరీ కూడా తనకు తెలీదని నాగార్జున అన్నారు. కానీ, ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యేందుకు కవాల్సిన అన్ని అంశాలు అందులో ఉన్నాయని అభిప్రాయపడ్డారు.
'తెలుగు ప్రేక్షకులకు ఈ ఏజెంట్ సినిమా కొత్త అనుభూతిని కలిగిస్తుంది. సురేందర్ రెడ్డి తెలుగులో ఎన్నో బ్లాక్ బస్టర్స్ అందించాడు. అదేవిధంగా, అనిల్ సుంకర భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ సినిమాలోని విజువల్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. కొత్త కథానాయిక సాక్షి చాలా బాగా నటించింది. ఆమెకు చాలా మంచి ఫ్యూచర్ ఉంది.' అని నాగార్జున చెప్పారు.
అంతేకాదు, ఈ సినిమాలో మళయాళ స్టార్ మమ్ముట్టి నటించారు కాబట్టి ఈ సినిమా కచ్చితంగా హిట్ అవుతుందని చెప్పారు. ఆయన అంత సామాన్యంగా ఏ సినిమా పడితే అది ఓప్పుకోరన్నారు. మమ్ముట్టి కథ నచ్చి, సినిమా ఒప్పుకున్నారంటే అది కచ్చితంగా హిట్ అవుతుందని నాగార్జున ధీమా వ్యక్తం చేశారు. కాగా, ఇటీవల మమ్ముట్టి తల్లి ఫాతీమ మరణించారు. ఈ సందర్భంగా ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్న నాగార్జున, మమ్ముట్టిపై ప్రశంసలు కురిపించారు.
ఎంత కష్ట సమయంలో అయినా, మమ్ముట్టి తన డబ్బింగ్ పూర్తి చేసారన్నారు. ఆయనలో అంకిత భావం చాలా ఎక్కువగా ఉంటుందని, చాలా కష్టపడతారన్నారు. ఇక ఈ సినిమా కోసం అఖిల్ కూడా చాలా కష్టపడ్డాడని నాగార్జున పేర్కొన్నాడు.
కాగా, సినిమా గురించి అఖిల్ కూడా మాట్లాడారు. తాను దాదాపు రెండు సంవత్సరాలుగా సురేందర్ రెడ్డితో ప్రయాణం చేస్తున్నానని, కలిసినప్పుడే క్రేజీగా ఏదో చేయాలని ఫిక్స్ అయ్యామన్నాడు. తాను ఈ సినిమా కోసం శారీరకంగా కంటే, మానసికంగా చాలా ఎక్కువ కష్టపడ్డానని అఖిల చెప్పాడు. కాగా ఈ సినిమాకి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. నిజానికి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి ప్రభాస్, రామ్ చరణ్ లు అతిథులుగా వస్తారని ప్రచారం జరిగింది. కానీ ఎవరూ రాకుండానే ఈ ఫంక్షన్ ముగిసింది.