Begin typing your search above and press return to search.
నాగ్ ఓ ముక్కలో తేల్చిపారేశాడబ్బా!
By: Tupaki Desk | 10 July 2022 1:01 PM GMTనాగార్జున కథానాయకుడిగా 'ది ఘోస్ట్' రూపొందింది. నారాయణదాస్ నారంగ్ .. రామ్మోహన్ రావు .. శరత్ మరార్ నిర్మించిన ఈ సినిమాకి ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాను అక్టోబర్ 5వ తేదీన విడుదల చేయనున్న విషయాన్ని తెలియజేస్తూ, ఒక గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాగార్జున మాట్లాడుతూ .. " ప్రవీణ్ సత్తారు ఇంతకుముందు చేసిన 'గరుడ వేగ' చూశాను .. యాక్షన్ సీన్స్ భలేగా తీశాడు. ఈ సినిమాలో నాతో కూడా స్టైలీష్ యాక్షన్ చేయించాడు. నేను శిక్షణ తీసుకుని మరీ చేయవలసి వచ్చింది.
ఈ సినిమాలో నేను ఇంటర్ పోల్ ఏజెంట్ విక్రమ్ గా కనిపిస్తాను .. నా కోడ్ నేమ్ ఘోస్ట్. ఈ సినిమాలో ఎమోషన్స్ ఉంటాయి .. ప్రవీణ్ తీసిన యాక్షన్ సీన్స్ హైలైట్ గా నిలుస్తాయి. ఈ సినిమాను 'శివ'తో కంపేర్ చేయవద్దు .. ఆ కథ వేరు .. ఇది వేరు. ఇంతకాలంగా ఇండస్ట్రీలో ఉన్నాను కనుక .. ఆడియన్స్ ఏ తరహా కథలను ఇష్టపడతారనే విషయంలో నాకు ఇక ఐడియా ఉంటుందని మీరంతా అనుకుంటారు .. కానీ నాకే కాదు ఎవరికీ ఈ విషయం తెలియదని అనుకుంటున్నాను. ఎలాంటి సినిమాను జనాలు చూస్తారు .. ఏ సినిమా ఎందుకు హిట్ అవుతుందనేది ఎవరికీ తెలియదు.
మొన్న రాజమౌళిగారితో కూడా ఇదే విషయాన్ని గురించిన చర్చ వచ్చింది. మనసు నచ్చిన సినిమా చేయడమే మన చేతుల్లో ఉంది అనుకున్నాము. ఆడియన్స్ ఏ తరహా పాత్రల్లో ఏ హీరోలను ఇష్టపడతారనేది కూడా చెప్పలేం. 'నిన్నే పెళ్లాడుతా' తరువాత 'అన్నమయ్య' చేయడానికి నేను ఆలోచన చేశాను. ఆ ప్రయత్నం మానుకోమని రాఘవేంద్రరావుగారికి చెప్పాను. కానీ ఆ సినిమా నా కెరియర్ లోనే పెద్ద హిట్ అయింది. 'అన్నమయ్య'కి ఆ స్థాయి రెస్పాన్స్ వస్తుందని నేనే అనుకోలేదు.
ఇక వర్మ .. నేను కలిసి చేసిన 'శివ' సినిమా ఎంత పెద్ద హిట్ అయిందనేది తెలుసు .. కానీ అదే మా కాంబినేషన్లో వచ్చిన 'ఆఫీసర్' సరిగ్గా ఆడలేదు. అలాగే కృష్ణవంశీతో నేను చేసిన 'నిన్నే పెళ్లాడుతూ' ఇండస్ట్రీ హిట్. ఆ తరువాత ఆయనతో చేసిన 'చంద్రలేఖ'ను ఇంటికి పంపించేశారు. మీరు కూడా రివ్యూలు రాస్తూ తప్పకుండా హిట్ అవుతాయని అనుకున్న సినిమాలు కొన్ని ఉంటాయి. కానీ అవి సరిగ్గా ఆడని సందర్భాలు ఉంటాయి. అలాగే ఫ్లాప్ అవుతాయని అనుకున్నవి హిట్ అవుతాయి. ఏ సినిమా హిట్ అవుతుందనేది ఎవరూ అంచనా వేయలేరు .. అదే తెలిస్తే ఇండస్ట్రీలో అందరూ నెంబర్ వన్ అయ్యేవాళ్లు కదా" అంటూ చెప్పుకొచ్చారు.