Begin typing your search above and press return to search.
రాజమౌళి గారూ ఒక ఛాన్సివ్వండి సార్
By: Tupaki Desk | 5 Sep 2015 8:23 AM GMTస్టార్ డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేసింది. ఈ సినిమాలో క్యారెక్టర్లన్నిటికీ చక్కని గుర్తింపు దక్కింది. అమరేంద్ర బాహుబలి, భళ్లాలదేవ, కట్టప్ప, శివగామి, దేవసేన, అవంతిక ఈ పాత్రలన్నీ జనాల నోళ్లలో నానుతున్నాయి. ఈ విజయం టాలీవుడ్‌కి గర్వ కారణం. ఇలాంటి ప్రాజెక్టులో ఛాన్స్ రానందుకు స్టార్ హీరో నాగార్జున చాలా బాధపడిపోతున్నారు. ఛాన్స్ మిస్సయ్యిందే జక్కన్నా ప్లీజ్ పిలిచి ఓ ఛాన్సివ్వవూ అంటూ బతిమాలేస్తున్నారు కింగ్ నాగార్జున. జక్కన్నను కింగ్ ఇలా రెక్వస్ట్ చేయడం ఆయన రెండోసారి.
పీరియడ్ డ్రామాలంటే నాకు చాలా ఇష్టం. రాజులు, రాజ్యాలు, కోటలు ఉన్న సినిమాల్లో నటించాలని ఎప్పట్నుంచో ఉంది. రాజ్యాలు కోల్పోయిన రాజుగా కనిపించడం ఇష్టమే. అందమైన రాకుమారి కోసం వేచి చూసే రాకుమారుడిలా కనిపించాలనుంది. ఇన్నేళ్ల నా కెరీర్‌లో ఇలాంటివి రానేలేదు. 20ఏళ్ల కెరీర్ లో ఇంకా ఇంకా మంచి క్యారెక్టర్లు చేయాలన్న ఆకలి తో ఉన్నా. మనం కూడా హాలీవుడ్ స్థాయి సినిమాల్లో నటించాలి. నాకు 300 - ట్రాయ్ ఎంతో ఇష్టమైన సినిమాలు. అలాంటివి మనదైన నేటివిటీతో చేయాలి. హాలీవుడ్ ప్రమాణాలున్న సినిమాలు చేయాలి.. అంటూ కింగ్ తన మనసులోని మాట చెప్పారు.
బాహుబలి లో జక్కన్న అవకాశం ఇస్తే నేను చేయడాని కి రెడీ అంటూ బహిరంగంగా ప్రకటించారు. హాలీవుడ్ లో కళ్లు చెదిరే సినిమాల్లాంటి సినిమాల్ని మనం ఇంకా ఇంకా తీయాలి.. అని అన్నారు. వింటున్నారా? జక్కన్నగారూ.. కింగ్ కోసం బాహుబలి 2 లో అయినా స్పేస్ ఉందా? విజయేంద్రునికి చెప్పి ఓ క్యారెక్టర్ ని కేటాయించండి ప్లీజ్!