Begin typing your search above and press return to search.
సెకండ్ లాక్ డౌన్ ను కూడా బిగ్ బాస్ తోనే నాగార్జున బ్రేక్
By: Tupaki Desk | 7 July 2021 11:30 AM GMTగత ఏడాది కరోనా కారణంగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ను విధించారు. ఆ సమయంలో మెల్ల మెల్లగా అన్ లాక్ చేసిన సమయంలో షూటింగ్ లకు సీనియర్ హీరోలు వెళ్లేందుకు కాస్త ఎక్కువ సమయం తీసుకున్నారు. షూటింగ్ లకు అనుమతులు ఇచ్చిన కొన్ని వారాల తర్వాత కొందరు.. కొన్ని నెలల తర్వాత కొందరు కెమెరా ముందుకు వచ్చారు. టాలీవుడ్ సీనియర్ హీరోల్లో ముందుగా నాగార్జున కెమెరా ముందుకు వచ్చాడు. గత ఏడాది ఆయన లాక్ డౌన్ ను బిగ్ బాస్ సీజన్ 4 కోసం ప్రోమో షూట్ కోసం బ్రేక్ చేశాడు. లాక్ డౌన్ తర్వాత ఆయన మొదటగా కెమెరా ముందుకు వచ్చింది మాత్రం బిగ్ బాస్ ప్రోమో కోసమే. ఆ విషయంను ఆయన అప్పట్లో సోషల్ మీడియాలో షేర్ చేయగా అంతా కూడా సీనియర్ హీరోల్లో మొదటగా కెమెరా ముందుకు వచ్చిన హీరో అంటూ నాగార్జునను అభినందించారు.
కరోనా కేసులు ఎక్కువగా ఉన్నా కూడా నాగార్జున తగు జాగ్రత్తలు తీసుకుని షూటింగ్ లో జాయిన్ అయ్యాడు. బిగ్ బాస్ ప్రోమో తర్వాత ఆయన వెంటనే వైల్డ్ డాగ్ తుది షెడ్యూల్ లో జాయిన్ అయ్యాడు. ఇప్పుడు కూడా అలాగే బిగ్ బాస్ తో నాగార్జున సెకండ్ లాక్ డౌన్ తర్వాత కెమెరా ముందుకు రాబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. సెకండ్ లాక్ డౌన్ తర్వాత ఆయన ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో సినిమాను చేయాల్సి ఉంది. కాని కొన్ని కారణాల వల్ల ఆ సినిమా కాస్త ఆలస్యం అవుతోంది. అందుకే ఈ గ్యాప్ లో నాగార్జున బిగ్ బాస్ సీజన్ 5 ప్రోమో షూట్ లో పాల్గొనబోతున్నట్లుగా తెలుస్తోంది.
ఒకటి రెండు రోజుల్లో నాగార్జున పై బిగ్ బాస్ సీజన్ 5 ప్రోమో ను చిత్రీకరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా షో నిర్వహకుల నుండి సమాచారం అందుతోంది. గత ఏడాది మాదిరిగా పూర్తి జాగ్రత్తలతో షో ను నిర్వహించేందుకు సర్వం సిద్దం అయ్యింది. నాగార్జున ఈ సీజన్ కు హోస్టింగ్ చేస్తాడా లేదా అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఒకానొక సమయంలో రానా ను ఈ సీజన్ కు హోస్ట్ గా ఎంపిక చేశారనే వార్తలు వచ్చాయి. మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా రానా బిగ్ బాస్ హోస్ట్ గా రాబోతున్నాడు అంటూ కథనాలు ప్రసారం చేశాయి. దాంతో నాగార్జునను మళ్లీ బుల్లి తెరపై చూడమేమో అంటూ అంతా భావించారు. కాని తాజా గా మీడియా సర్కిల్స్ ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం నాగార్జుననే సీజన్ 5 కి హోస్ట్ గా వ్యవహరించబోతున్నాడని తెలుస్తోంది.
సీజన్ 5 కోసం ఇప్పటికే కంటెస్టెంట్స్ ఎంపిక జరిగింది. అతి త్వరలోనే వారు అందరికి వ్యాక్సినేషన్ పూర్తి చేయడంతో పాటు ఈసారి కూడా కంటెస్టెంట్స్ ను కనీసం రెండు వారాల పాటు క్వారెంటైన్ లో ఉంచి ఆ తర్వాత హౌస్ లోకి పంపించే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆగస్టు చివరి వారంలో లేదా గత సీజన్ మొదలు పెట్టినట్లుగా సెప్టెంబర్ లో అయినా బిగ్ బాస్ సీజన్ 5 ను మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఈ సీజన్ కు కూడా నాగార్జున హోస్ట్ అని అతి త్వరలోనే రాబోతున్న సీజన్ 5 ప్రోమోలతో క్లారిటీ ఇవ్వాలని షో నిర్వాహకులు భావిస్తున్నారు. ఇప్పటి వరకు నాలుగు సీజన్ లకు కూడా మంచి రేటింగ్ వచ్చింది. కనుక అయిదవ సీజన్ కు కూడా తప్పకుండా మంచి రేటింగ్ వస్తుందనే నమ్మకంను ప్రేక్షకులు మరియు షో నిర్వాహకులు అంటున్నారు. నాగార్జున బిగ్ బాస్ సీజన్ 5 ప్రోమో చిత్రీకరణ లో పాల్గొన్న వెంటనే ప్రవీణ్ సత్తార్ మూవీ షూటింగ్ లో జాయిన్ అయ్యే అవకాశం ఉందంటున్నారు.