Begin typing your search above and press return to search.
నాగ్-అమల.. 23వ పెళ్లి రోజు!!!
By: Tupaki Desk | 11 Jun 2015 1:30 PM GMTనాగార్జున - అమల జంట టాలీవుడ్లో ఆదర్శజంటగా పేరు తెచ్చుకున్నారు. ఆన్‌సెట్స్ ప్రేమించుకున్నారు. ఆ ప్రేమ పరిమళించి పెద్దల అంగీకారంతో పెళ్లి వరకూ వెళ్లింది. అటుపై ఆదర్శవంతమైన సంసార జీవితాన్ని సాగించి నవతరానికి ఆదర్శమయ్యారు. ఇప్పటికే ఈ జంట మూడుముళ్ల బంధంతో ఒకటై 23 వసంతాలు పూర్తయింది.
రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో శివ చిత్రంలో తొలిసారి జోడీగా నటించారు. ఆ తర్వాత రామూ దర్శకత్వంలోనే నిర్ణయం అనే చిత్రంలో నటించారు. ఆ రెండు సినిమాల వల్లే ఈ ప్రేమ సాధ్యమైంది. అటుపై 11 జూన్, 1992లో పెళ్లితో ఒకటయ్యారు. నాగార్జున-అమల ప్రేమకథ గురించి తెలిసినవారు కొన్ని ఆసక్తికర సంగతులు చెబుతుంటారు. ఈ ఇద్దరూ ఆన్‌సెట్స్ పనిచేసేప్పుడు ఒకరిగురించి ఒకరు తెలుసుకున్నారు. కాలక్రమేణా అభిరుచులు కలిశాయి. బంధం ముడిపడిందని చెబుతారు.
పెళ్లయి ఇంతకాలమైనా ఐదు పదుల వయసులోనూ ఇప్పటికీ యంగ్ కపుల్‌గా అలరిస్తున్న ఈ జంట నిజంగానే ఆదర్శ జంట. నిత్యం ఆరోగ్య సూత్రాల్ని అనుసరిస్తూ ఆహ్లదకరమైన జీవితాన్ని సాగించడం వల్లే నిత్యయవ్వనంతో ఉన్నారన్నది కాదనలేని వాస్తవం. ఆ రకంగా ఈ జంట అందరికీ ఆదర్శం.