Begin typing your search above and press return to search.

అపురూపమైన స్టార్ కపుల్ మ్యారేజ్ ఫోటో..

By:  Tupaki Desk   |   17 Jun 2020 2:30 PM GMT
అపురూపమైన స్టార్ కపుల్ మ్యారేజ్ ఫోటో..
X
టాలీవుడ్ బెస్ట్ లవ్ కపుల్స్ లో అక్కినేని నాగార్జున - అమల కపుల్ ఒకటి. లవ్ మ్యారేజ్ చేసుకొని సినీ ఇండస్ట్రీతో పాటు అభిమానుల మదిలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. సినిమా కెరీర్ ప్రారంభంలోనే స్టార్ యాక్టర్లుగా ఎదుగుతున్న సమయంలో నాగార్జున - అమల ఒకరినొకరు ఇష్టపడి అర్ధం చేసుకొని మూడు ముళ్ళ బంధంతో ఒకటయ్యారు. ఇక వీరిద్దరూ కలిసి వెండితెర పై పలు హిట్ సినిమాలలో నటించారు. అందులో ప్రేమయుద్ధం.. కిరాయి దాదా.. శివ.. నిర్ణయం.. సినిమాలలో నటించే టైంలోనే ఇద్దరిలో ప్రేమ పెరుగుతూ వచ్చింది. ఇక ఇద్దరు 1992 జూన్ 11న పెళ్లి చేసుకొని.. మనసులతో పాటు జీవితాలను ముడి వేసుకున్నారు.

ఇటీవలే వీరి 28వ వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్నారు. వీరి పెళ్లిరోజును పురస్కరించుకొని సోషల్ మీడియా వేదికగా సినీ ప్రముఖులు.. అభిమానులు శుభాకాంక్షల వర్షం కురిపించారు. ప్రతి ఏడాది పెళ్లి రోజును జరుపుకున్నట్లే ఈసారి కూడా సింపుల్ గా.. డిఫరెంట్ గా జరుపుకున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఏర్పడిన మహమ్మారి పరిస్థితుల వలన కాస్త ప్రత్యేకంగానే ఇద్దరూ తమ పెళ్లి రోజు వేడుకను జరుపుకున్నారు. ఎప్పుడు కుటుంబ సభ్యులతో జరుపుకునే వీరు ఈసారి ఇద్దరే జరుపుకోవడం విశేషం. ఇక తాజాగా సోషల్ మీడియాలో తమ పెళ్లినాటి మెమరబుల్ ఫోటో ఒకటి షేర్ చేశారు నాగార్జున.

అందులో ఇద్దరు నాగార్జున - అమల ఇద్దరు కూడా పెళ్లి దుస్తులలో మెరిసిపోతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వీరి పెళ్లి ఫోటో తెగ వైరల్ అవుతోంది. నాగార్జు - అమల తెల్లని దుస్తులలో చుడముచ్చటగా ఉన్నారని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఫోటోలో నాగార్జున ఎప్పట్లాగే హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడు.. అమల మాత్రం అమాయకంగా సిగ్గు పడుతూ కనిపించింది. ఇక గతంలో జరిగిన ఒక సంఘటన గుర్తు చేసుకుంటూ.. ఆనాటి షూటింగ్ సన్నివేశాలు.. మధుర జ్ఞాపకాలు నెమరువేసుకున్నారట. ఫ్యాన్స్ ఆ ఫోటోను మాత్రం నెట్టింట చక్కర్లు కొట్టిస్తున్నారు.