Begin typing your search above and press return to search.
రేయ్ అఖిల్.. అంటూ నాగ్ పిలిస్తే..
By: Tupaki Desk | 5 Dec 2017 5:05 PM GMTఇప్పుడు సోషల్ మీడియా అంతా కూడా ఒకటే టాపిక్ చాలా వైరల్ అయిపోతోంది. అదేంటంటే.. తన చిన్న కొడుకు అఖిల్ తో కింగ్ నాగార్జున్ ట్విట్టర్ లో షేర్ చేసుకున్న ఒక ట్వీట్ భలేగా ఉంది. ముద్దొస్తోంది. ఆ తండ్రీ కొడుకుల ప్రేమకు అద్దంపడుతోంది. అసలు నాగ్ కు తన పిల్లలంటే ఎంతిష్టమో చెప్పకనే చెబుతోంది. పదండి ట్వీట్ల సందడేంటో మనం కూడా చూసేద్దాం.
ముందగా అఖిల్ ఒక ట్వటేశాడు. ''ఇప్పుడే నేను హలో సినిమా పాటల తాలూకు ఫైనల్ మిక్సింగ్ విన్నాను. అదిరిపోయాయ్. అన్ని పాటలూ రిలీజ్ అయ్యేవరకు వెయిట్ చేయడం కష్టం. అందుకే రేపు మీకో సర్పరైజ్ ఇస్తున్నాను'' అన్నాడు అఖిల్. కాసేపట్లో ఆ ట్వీట్ పై స్పందించిన నాగార్జున.. ''రేయ్ అఖిల్.. అసలు రేపు సాయంత్రం నువ్వు ఒక పాటను రిలీజ్ చేస్తున్నావని నాకు చెప్పలేదే? ఇదేనా ఆ పాట? నా ఫోన్లో రికార్డు చేసేశా?'' అంటూ ఆయన తన ఫోన్ లో రికార్డ్ చేసిన ఆ పాట తాలూకు వీడియోను షేర్ చేశారు. అసలు ఈ మాటామంతి ఎంత ముద్దుగా ఉందో కదూ.
తరువాత స్పందించిన అఖిల్.. ''నాన్నా.. నాకు ఈ రికార్డింగ్ చూపించలేదేంటి? ఆడియో రిలీజ్ అయ్యేవరకు ఆగలేక అలా పాటను రిలీజ్ చేసేద్దాం అని అప్పటికప్పుడు అనుకున్నాను'' అంటూ రిప్లయ్ ఇచ్చాడు. మొత్తానికి తండ్రీ కొడుకుల ప్రేమలు ట్విట్టర్ సాక్షిగా అదిరాయ్. హలో.. ఆ పాట కూడా అదిరిపోయిందమ్మా.