Begin typing your search above and press return to search.
నాగ్ కొత్త మల్టీస్టారర్ టైటిల్ ఫిక్స్
By: Tupaki Desk | 20 Oct 2018 9:12 AM GMTనాగార్జున ఒకవైపు సోలో హీరోగా వరుసగా సినిమాలు చేస్తూనే మంచి కథలు వస్తే మల్టీస్టారర్ చిత్రాలను చేసేందుకు ఓకే చెబుతున్నాడు. ఇప్పటికే యువ హీరోలతో నాగార్జున ‘ఊపిరి’ - ‘దేవదాస్’ చిత్రాలను చేసిన విషయం తెల్సిందే. నానితో కలిసి చేసిన ‘దేవదాస్’ చిత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది. కాని నాగార్జున పోషించిన పాత్ర మాత్రం మంచి పేరును దక్కించుకుంది. ‘దేవదాస్’ విడుదలకు ముందే నాగార్జున తమిళంలో ధనుష్ తో కలిసి ఒక చిత్రంలో నటించేందుకు కమిట్ అయ్యాడు.
తమిళ స్టార్ హీరో ధనుష్ ఒక వైపు వరుసగా చిత్రాల్లో నటిస్తూనే దర్శకుడిగా కూడా తనకంటూ ఒక గుర్తింపును దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ధనుష్ హీరోగా నటిస్తూ తన మామ ముఖ్య పాత్రలో 100 కోట్ల బడ్జెట్ తో సినిమా చేయాలని భావించాడు. కాని రజినీకాంత్ కొన్ని కారణాల వల్ల నో చెప్పడంతో ఆ పాత్రను నాగార్జునతో చేయిస్తున్న విషయం తెల్సిందే. ఇప్పటికే చిత్రీకరణ ప్రారంభం అయిన ఆ చిత్రంకు తమిళ టైటిల్ ఖరారు అయ్యింది.
తమిళంలో నాగార్జున - ధనుష్ ల మల్టీస్టారర్ చిత్రానికి ‘నాన్ రుద్రన్’ అనే టైటిల్ ను ఖరారు చేసినట్లుగా సమాచారం అందుతుంది. తెలుగులో కూడా ఈ చిత్రాన్ని భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు. అందుకోసం కొన్ని సీన్స్ ను ప్రత్యేకంగా తెలుగు కోసం చిత్రీకరించబోతున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. ఇప్పటి వరకు ధనుష్ తెలుగులో ఒకటి రెండు చిత్రాలతో మినహా పెద్దగా ఆకట్టుకున్నది లేదు. మరి నాగార్జునతో కలిసి రాబోతున్న ‘నాన్ రుద్రన్’తో అయినా మెప్పిస్తాడేమో చూడాలి. ఒక వైపు ధనుష్‌తో మల్టీస్టారర్ లో నటిస్తున్న నాగార్జున హిందీ ‘బ్రహ్మాస్త్ర’ చిత్రంలో నటిస్తున్నాడు. తెలుగులో కూడా ఈయన ఒక చిత్రాన్ని చేయబోతున్నాడు. ఆ చిత్రంకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది.