Begin typing your search above and press return to search.
ఇక్కడ నాగార్జున.. అక్కడ కమల్
By: Tupaki Desk | 5 Nov 2015 1:30 PM GMTసౌత్ ఇండియాలోని ఇద్దరు పెద్ద హీరోలకు సడెన్ గా ఫ్రెంచ్ సినిమాల మీద కన్ను పడింది. ఇక్కడ మన నాగార్జున - అక్కడ కమల్ హాసన్ ఫ్రెంచ్ సినిమాల మీద మనసు పడ్డారు. ఫ్రెంచిలో గత కొన్నేళ్లలో వచ్చిన రెండు బెస్ట్ మూవీస్ ని తెలుగు - తమిళ ప్రేక్షకులకు కానుకగా అందించబోతున్నారు. ముందు తమ సినిమాలు ఫ్రెంచి నుంచి అరువు తెచ్చుకున్నవి అని ఒప్పుకోవడానికి ఇష్టపడని ఈ ఇద్దరు సీనియర్ హీరోలు.. ఇప్పుడు ఆ సంగతి ఒప్పేసుకుంటున్నారు.
ఈ నెల 10న తమిళంలో, 20న తెలుగులో విడుదల కాబోతున్న కమల్ సినిమా ‘చీకటి రాజ్యం’కు ‘స్లీప్ లెస్ నైట్స్’ అనే ఫ్రెంచి సినిమా స్ఫూర్తి అని సినిమా మొదలైనపుడే వార్తలొచ్చాయి. కానీ కమల్ అప్పట్లో సైలెంటుగా ఉన్నాడు. కానీ విడుదల దగ్గరపడ్డపుడు ఆ సంగతి ఒప్పేసుకున్నాడు. ఐతే తాము తీసింది ఫ్రీమేక్ కాదని.. హక్కులు కొన్నామని ఆయనంటున్నారు. ఆయన స్లీప్ లెస్ నైట్స్ సినిమా తీసిన వాళ్ల దగ్గర హక్కులు తీసుకోలేదు. ఆ సినిమాకు ఆధారమైన నవలకు సంబంధించి రైట్స్ కొనుక్కున్నారు.
ఇక నాగ్ సినిమా ‘ఊపిరి’ విషయానికి వస్తే.. అది ‘ఇన్ టచబుల్స్’ అనే సినిమా ఆధారంగా రూపొందింది. ఈ సంగతి నాగ్ కూడా ఒప్పేసుకున్నాడు. ఈ సినిమా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా బాగానే గుర్తింపు సంపాదించింది. మరి హక్కులు కొన్నారో లేదో కానీ.. ఆ సినిమా ఆధారంగా తీస్తున్నట్లయితే ఒప్పుకున్నారు సంతోషం. మరి ఈ ఫ్రెంచ్ స్ఫూర్తి మన సీనియర్ హీరోలకు ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.