Begin typing your search above and press return to search.
ఆఫీసర్.. తీరా చూస్తే అదే కథా??
By: Tupaki Desk | 29 May 2018 1:32 PM GMTనిజానికి ఒక రియల్ లైఫ్ పోలీస్ ఆఫసీర్ కథతో ''ఆఫీసర్'' కథ తీస్తున్న అని రామ్ గోపాల్ వర్మ చెప్పాడు. అయితే ఈ దర్శకుడు పేర్కొన్న ఐపిఎస్ ఆఫీసర్ ఇప్పటికీ ఇంకా పదవిలోనే ఉన్నారు. కాని ఆయన చేసిన పనులకు కాస్త సినిమాటిక్ టచ్ ఇచ్చేసి సినిమాను మరో దారిలో నడిపించాడట వర్మ. అయితే ఈ సినిమాలో నాగార్జున చాలా కొత్తగా ఉంటాడు కొత్త కథ అంటూ ఎక్సయిటింగ్ మాటలెన్నో చెప్పిన వర్మ.. 'ఆ ఆఫీసర్ ఇక సివిల్ డ్రస్సులో కనిపిస్తాడు. వయలెంట్ అవుతాడు' అంటూ కథను కాస్త లీక్ చేసేశాడు.
నిజానికి ఒక పెద్ద పోలీస్ ఆఫీసర్ ఒక మాఫియా డాన్ తో సంబంధం పెట్టుకుని.. తన క్రింద పనిచేసే ఒక ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ టీముతో.. కేవలం ఆ డాన్ కు వ్యతిరేకంగా ఉన్నవారినే చంపించాడని ఒక నిజమైన అభియోగమే ఉంది. దానినే కథగా మలచి.. పూరి జగన్ 'గోలిమార్' అని తీశాడు. అయితే ఇప్పుడు ఆఫీసర్ సినిమాలో కూడా సెకండాఫ్ అంతా ఇదే కథ అంటూ తెలుస్తోంది. తన డిపార్టుమెంటులోని వ్యక్తులే కాంప్రమైజ్ అయిపోయి తనను ఇబ్బందిపెట్టడంతో.. యునిఫామ్ వదిలేసి సివిల్ డ్రస్ వేసి వారి తాట తీస్తాడట నాగ్. మరి ఆల్రెడీ దాదాపు ఇలాంటి కథను తీస్తేనే ఆడలేదు కదా? ఇప్పుడు ఇదే కథ మళ్లీ ఆడుతుందా? అనే సందేహం న్యాచురల్ గానే వస్తుంది.
అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే.. కథనం ఎంత బాగుంది అనే విషయంపై సినిమా ఫేట్ ఆధారపడుతుంది. తన తండ్రికి ఏమైంది ఎవరు చంపారు అని తెలుసుకోవడానికి ప్రయత్నించిన కథ 1 నేనొక్కడినే అయితే.. ఆ తండ్రి కోసం రివెంజ్ తీర్చుకునే కథ నాన్నకుప్రేమతో. అక్కడ తండ్రిని తీసి అన్నయ్యను పెడితే రంగస్థలం. కాన్సెప్టు ఒక్కటే.. ఫ్రేమ్ వర్క్ దాదాపు అదే.. కాని ఆ సిట్యుయేషన్లను లాజిక్కులను ఎమోషన్లను మలచిన తీరు కారణంతో.. ఒకటి బ్లాక్ బస్టర్.. ఒకటి హిట్.. ఒకటి ఫ్లాప్ అయ్యాయ్. ''ఆఫీసర్'' వీటిలో ఏమవుతాడో రిలీజైతే కాని తెలియదు.