Begin typing your search above and press return to search.

చైతు కోసం అటు నాగ్ ఇటు వెంకీ..!

By:  Tupaki Desk   |   27 March 2019 6:22 PM IST
చైతు కోసం అటు నాగ్ ఇటు వెంకీ..!
X
నాగచైతన్య కొత్త సినిమా 'మజిలీ' ఏప్రిల్ 5 న విడుదలకు సిద్దమవుతోంది. ఇప్పటికే ఇంట్రెస్టింగ్ ప్రోమోలతో ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించిన ఈ సినిమాకు మార్చ్ 31 న ప్రీరిలీజ్ ఈవెంట్ జరిపేందుకు ఫిలిం మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. హైదరాబాద్ లోనే ఈ కార్యక్రమం నిర్వహిస్తారట కానీ ఇంకా వెన్యూ ఏదనే విషయం మాత్రం ఇంకా బయటకు రాలేదు.

ఫిల్మీ ఈవెంట్ అనగానే చీఫ్ గెస్టు ఎవరనే ఆసక్తి నెలకొంటుంది. 'మజిలీ కోసం కూడా గెస్టు వస్తున్నారు.. గెస్టు కాదు గెస్టులు. కింగ్ అక్కినేని నాగార్జున.. విక్టరీ వెంకటేష్ ఇద్దరూ కలిసి ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారని సమాచారం. కుమారుడి కోసం నాగ్.. మేనల్లుడి కోసం వెంకీ తమ సపోర్ట్ ఇస్తున్నారన్నమాట. చైతు డెబ్యూ సినిమా 'జోష్' ఈవెంట్ కు నాగార్జున - వెంకటేష్ ఇద్దరూ కలిసి హాజరయ్యారు. మళ్ళీ ఇన్నేళ్ళకు చైతుకోసం ఇద్దరూ వేదిక పంచుకోబోతుండడం అభిమానులకు ఆనందాన్నిచ్చేదే.

ఈ సినిమాలో చైతూ సరసన సమంతా.. దివ్యాన్ష కౌశిక్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. గోపి సుందర్ సంగీతం అందించాడు. 'నిన్ను కోరి' ఫేం శివ నిర్వాణ ఈ చిత్రానికి దర్శకుడు. ఈ సినిమాను సాహు గారపాటి.. హరీష్ పెద్ది షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.