Begin typing your search above and press return to search.

అలా చేస్తే చెంపదెబ్బలు తగిలేవి: నాగ్!

By:  Tupaki Desk   |   28 March 2016 4:42 AM GMT
అలా చేస్తే చెంపదెబ్బలు తగిలేవి: నాగ్!
X
‘ఇమేజ్‌ ను నమ్ముకొని సినిమా చేసిన ప్రతిసారీ చెంప దెబ్బలే తినాల్సి వచ్చింది. ఇమేజ్‌ ను నమ్ముకొని సినిమాలు చేస్తే చేసిన కథలే మళ్లీ మళ్లీ చేయాల్సి వస్తుంది. నా కథలు నాకే బోర్‌ కొట్టేవి. ఇప్పుడు నా ప్రయాణం చాలా బాగుంది' అన్నారు నాగార్జున. నాగ్ తాజా చిత్రం ‘ఊపిరి’ సక్సెస్ మీట్ హైదరాబాద్‌ లో జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన నాగ్.. 'ఏంతో ప్రేమతో ఈ సినిమా చేశామని, సెట్లో ఉన్నప్పుడే ఈ సినిమా ట్రెండ్‌ ను సృష్టించేలా కాకుండా నా జీవితాన్ని మార్చేసే సినిమా అవుతుందని భావించానని, ఇప్పుడదే నిజమైందని చెప్పారు. సినిమాలో ప్రతి సీన్ రియలిస్టిక్ గా ఉంటుంది. రాఘవేంద్రరావు గారు ఫోన్ చేసి ప్రతి సీన్ గురించి మాట్లాడుతుంటే నెక్స్ట్ సినిమా మీతోనే ఉంటుంది సర్ అని చెప్పగానే ఫోన్ పెట్టేసి లోకేషన్స్ వెతుక్కోవాడానికి వెళ్ళారు. సినిమా చూసిన కొందరు కార్తి రోల్ మీకంటే ఎక్కువుందని చెప్పారు. ఎవరి రోల్ ఎక్కువ ఉందని ఆలోచించి సినిమా చేయలేదు. కార్తి నాకు తమ్ముడు లాంటి వాడు. ఇంతటి విజయం చేకూర్చిన ప్రేక్షకులకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు' నాగ్.