Begin typing your search above and press return to search.
నాగ్ ఇచ్చిన ఈ ఛాన్స్ నూ చేజార్చుకున్నాడు
By: Tupaki Desk | 30 Nov 2018 6:24 AM GMTఅఖిల్ ను స్టార్ హీరోగా నిలిపేందుకు నాగార్జున చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ట్యాలెంటెడ్ దర్శకులతో పాటు స్టార్ డైరెక్టర్స్ తో అఖిల్ సినిమాలను చేయాలని నాగార్జున భావించాడు. అందుకోసం అఖిల్ హీరోగా పరిచయం అయిన సమయంలోనే పలువురు దర్శకులతో చర్చలు జరిపాడు. అదే సమయంలో శ్రీనువైట్లతో కూడా చర్చలు జరిపాడు. అఖిల్ మొదటి లేదా రెండవ సినిమాకు శ్రీనువైట్ల దర్శకత్వం వహించాల్సి ఉంది. కాని ఆగడు, బ్రూస్లీ ఫలితాల కారణంగా శ్రీనువైట్లను నాగార్జున పక్కకు పెట్టాడు.
ఆమద్య అఖిల్ తో మూవీకి శ్రీనువైట్ల ప్రయత్నించాడు. కాని ఒక్క సక్సెస్ ఇచ్చి నిరూపించుకోమని వైట్లకు నాగార్జున సూచించాడట. తాజాగా శ్రీనువైట్ల దర్శకత్వంలో ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ చిత్రం వచ్చింది. రవితేజ హీరోగా ఇలియానా హీరోయిన్ గా నటించిన ఆ చిత్రం అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఏమాత్రం ఆకట్టుకోలేక పోయిన ఆ సినిమా శ్రీనువైట్ల కెరీర్ ను మరింత కష్టాల్లోకి నెట్టివేసింది. అమర్ అక్బర్ ఆంటోనీ సినిమా ఆడితే వైట్లకు ఖచ్చితంగా అఖిల్ తో మూవీ చేసే అవకాశం దక్కేదట. కాని నాగార్జున ఇచ్చిన చివరి అవకాశం కూడా వైట్ల వినియోగించుకోలేక పోయాడు.
నాగార్జున మాత్రమే కాదు, ఇంకా పలువురు స్టార్స్ కూడా గతంలో వైట్లకు హామీ ఇచ్చి ఇప్పుడు మొహం చాటేస్తున్నారట. దాంతో కొత్త వారితో సినిమా చేయాలనే నిర్ణయానికి వైట్ల వచ్చినట్లుగా తెలుస్తోంది. తక్కువ బడ్జెట్ తో సినిమా కోసం తన టీంతో కలిసి వైట్ల ప్రస్తుతం కథను సిద్దం చేసే పనిలో ఉన్నాడట. వచ్చే ఏడాదిలో సినిమాను ప్రారంభించి, అదే ఏడాది విడుదల చేస్తాడట. వైట్లకు ఈ చిన్న ప్రయత్నం అయినా సక్సెస్ ను తెచ్చి పెడుతుందేమో చూడాలి.